Nayanthara Confirms Engagement With Director Vignesh Shivan - Sakshi
Sakshi News home page

Nayanthara : ఎంగేజ్‌మెంట్‌ను రివీల్‌ చేసిన నయన్‌

Published Tue, Aug 10 2021 8:22 PM | Last Updated on Wed, Aug 11 2021 11:08 AM

Nayanthara Confirms Engagement With Vignesh Shivan - Sakshi

Nayanthara Confirms Engagement: లేడీ సూపర్‌స్టార్‌ నయనతార సినిమాలతో కంటే లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్ విషయంలోనే ఎక్కువ పాపులర్‌ అయ్యింది. గత నాలుగేళ్లుగా నయన్‌.. తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో  పీకల్లోతు  ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే తమ పెళ్లి ఉంటుందని, అందుకు డబ్బులు కూడబెడుతున్నాం అంటూ విఘ్నేశ్‌ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.


కానీ ఇప్పటివరకు తమ రిలేషన్‌పై ఎక్కడా మాట్లాడని నయనతార తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొని పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలపై ఓపెన్‌అప్‌ అయ్యింది. ఈ సందర్భంగా తనకు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందని, దానికి సంబంధించి రింగ్‌ను చూపించి అందరికి షాకిచ్చింది. గతంలో విఘ్నేష్‌ శివన్ గుండెల మీద చేయి వేసి రింగ్‌ ఉన్న ఫోటోను హైలేట్‌ చేస్తూ నయన్‌ ఓ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.


దీంతో అది ఎంగేజ్‌మెంట్‌ రింగే అయి ఉంటుందని పలువురు నెటిజన్లు భావించారు. కానీ దీనిపై ఇరువురు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఇది ఫోటో కోసమేనేమో అని అనుకున్నారంతా. కట్‌ చేస్తే ఆ వార్తలను నిజం చేస్తూ స్వయంగా నయనతార తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement