Director Ps Mithran Engagement With Film Journalist Ashameera Ayyappan - Sakshi
Sakshi News home page

Director Ps Mithran: ఫిలిం జర్నలిస్ట్‌తో స్టార్‌ డైరెక్టర్‌ నిశ్చితార్థం, కొత్త జంటకు హీరో కార్తి విషెస్‌

Published Sat, Jun 25 2022 4:13 PM | Last Updated on Sat, Jun 25 2022 7:13 PM

Director Ps Mithran Engagement With Film Journalist Ashameera Ayyappan - Sakshi

ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఓ ఫిలిం జర్నలిస్ట్‌తో ఆయన ఏడడుగులు వేయబోతున్నాడు. తమిళ చిత్రం హీరో ఫేం పీఎస్‌ మిత్రాన్‌ ఫిలిం జర్నలిస్ట్‌ ఆశామీరా ఆయప్పన్‌ల నిశ్చితార్థం శుక్రవారం(జూన్‌ 24న) ఘనంగా నిర్వాహించారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియా వైరల్‌గా అవుతున్నాయి. దీంతో డైరెక్టర్‌ మిత్రాన్‌కు కోలీవుడ్‌ సినీ ప్రముఖులు, స్టార్స్‌ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్‌ పెళ్లా?, ఫొటో వైరల్‌

హీరో కార్తీ, డైరెక్టర్‌ రవి కుమార్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా ఈ కొత్త జంటగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆశామీరా సైతం దర్శకుడు మిత్రాన్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడిస్తూ.. తమపై ఇంత ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరి థ్యాంక్స్‌ అంటూ ట్వీట్‌ చేసింది. కాగా మిత్రాన్‌ హీరో విశాల్‌ అభిమన్యుడు(తమిళంలో ఇరుంబుతిరై) మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల మిత్రాన్‌ ఈ మూవీ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. అనంతరం శివ కార్తికేయన్‌తో హీరో మూవీని తెరకెక్కించి తన మార్క్‌ను చూపించాడు. ప్రస్తుతం మిత్రాన్‌ కార్తీ హీరో సర్దార్‌ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. 

చదవండి: ‘కార్తికేయ 2’ ట్రైలర్‌ ఈవెంట్‌, వేదికపైనే ఫ్యాన్‌కి నిఖిల్‌ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement