దసరాకే 'ధృవ' | ram charan druwa postponed to dussehra | Sakshi
Sakshi News home page

దసరాకే 'ధృవ'

Published Sat, May 7 2016 9:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

దసరాకే 'ధృవ'

దసరాకే 'ధృవ'

యంగ్ హీరో రామ్ చరణ్ రెండు పడవల మీద ప్రయాణానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చెర్రీ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా పట్టాలెక్కింది. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. బ్రూస్ లీ సినిమాతో నిరాశపరిచిన చరణ్ వీలైనంత త్వరగా అభిమానులను సక్సెస్తో పలకరించాలని భావిస్తున్నాడు.

అయితే అదే సమయంలో చిరు 150 సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా భుజాల మీద వేసుకున్నాడు. వినాయక్ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న కత్తి లాంటోడు సినిమాను అల్లు అరవింద్తో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్లాన్ చేశాడు. తన సినిమాలో హీరోగా నటిస్తూనే, తండ్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి పక్కాగా స్కెచ్ వేస్తున్నాడు. మరి చెర్రీ రెండు పడవల ప్రయాణం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement