tagore
-
శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు?
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ యునెస్కో వారసత్వ జాబితాలో చేరింది. శాంతినికేతన్ నాటి రోజుల్లో భారతదేశంలో ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఒక విశ్వవిద్యాలయం. దీనిని మనం ఇప్పుడు విశ్వభారతి అని కూడా పిలుస్తున్నాం. గురుదేవులు శాంతి నికేతన్‌ను ప్రారంభించినప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్.. త్రిపురతోపాటు అనేక రాజ కుటుంబాల నుండి ఆర్థిక సహాయం అందుకున్నారు. ఆ సమయంలో చైనా కూడా శాంతినికేతన్ నిర్వహణకు భారీగా ఆర్థిక సహాయం అందించింది. చైనా అందించిన ఆర్థిక సహాయానికి గుర్తుగా శాంతి నికేతన్‌లోని చైనా భవన్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ విద్యాలయంలో చైనీస్ భాష బోధించడంతో పాటు, చైనా సంస్కృతిపై అధ్యయనం చేస్తారు. శాంతి నికేతన్‌కు గొప్ప సహాయం అందించిన చైనా పండితుని పేరు తాన్ యున్ జెన్. ఆయన చదువుకునేందుకు శాంతి నికేతన్‌కు వచ్చారు. ఆ తర్వాత ఈ యూనివర్సిటీకి భారీగా ఆర్థిక సాయం అందించారు. తాన్ యున్ జెన్ శాంతినికేతన్ క్యాంపస్‌లో చైనా భవనాన్ని నిర్మించి, దానిని అభివృద్ధి చేసిన వ్యక్తి. అతను రచయిత, కవి, వ్యాసకర్త, తత్వశాస్త్ర పండితుడు. అలాగే భాషావేత్త. మహాయాన బౌద్ధ, కన్ఫ్యూషియన్ పండితునిగానూ పేరుగాంచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1924లో చైనాను సందర్శించారు. మూడు సంవత్సరాల తర్వాత గురుదేవులు మలయాలో తాన్ను కలిశారు. అనంతరం అతను చదువుకోవడానికి శాంతి నికేతన్‌కు వచ్చారు. అతను ఇక్కడ భారతీయ సంస్కృతిని అభ్యసించారు. కాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఠాగూర్ కొత్త విభాగాలను తెరవలేకపోయారు. గురుదేవులు చైనీస్ సంస్కృతి, భాష బోధించే ఒక విభాగాన్ని కూడా స్థాపించాలనుకున్నారు. 1931లో తాన్ నిధుల సేకరణ కోసం సింగపూర్, రంగూన్, చైనా దేశాలకు వెళ్లారు. దాదాపు ఐదేళ్ల తర్వాత శాంతినికేతన్‌కు తిరిగి వచ్చి రూ.50 వేల ఆర్థిక సహాయంతో పాటు లక్ష పుస్తకాలను అందించారు. తరువాత ఆయన శాంతినికేతన్లోనే ఉండిపోయారు. 30 ఏళ్లపాటు శాంతినికేతన్‌కు సేవలు అందించారు. 1937 ఏప్రిల్ 14న చైనా భవన్ ఏర్పాటయ్యింది. దీనిని ఇందిరాగాంధీ ప్రారంభించారు. చైనా ప్రతినిధి చియాంగ్ కై-షేక్ 1957లో శాంతి నికేతన్‌ను సందర్శించినప్పుడు చైనా హాల్, విశ్వవిద్యాలయానికి భారీ ఆర్థిక సహాయం అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో ఏడు ఎకరాల స్థలంలో ఆశ్రమాన్ని స్థాపించారు. అదే నేడు విశ్వభారతిగా పేరొందింది. ఠాగూర్ 1901లో కేవలం ఐదుగురు విద్యార్థులతో ఇక్కడ పాఠశాలను ప్రారంభించారు. వీరిలో అతని కుమారుడు కూడా ఉన్నాడు. 1921లో జాతీయ విశ్వవిద్యాలయ హోదా పొందిన విశ్వభారతిలో ప్రస్తుతం 6000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ క్యాంటీన్లో ఏమేమి దొరుకుతాయి? ధరలు ఎంత? -
‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక..
హార్మోనియం.. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీత వాయిద్య పరికరం. ఇది నిజంగా భారత దేశానికి చెందినదేనా? అనే సందేహం చాలామందిలో దశాబ్దాలుగా ఉంది. అయితే కొందరు ఇది భారతీయులదేనని గాఢంగా నమ్ముతుంటారు. 1900ల ప్రారంభంలో స్వాతంత్ర్య పోరాటం ఊపందుకున్నప్పుడు భారతీయ శాస్త్రీయ సంగీతానికి హార్మోనియం అనువైనదా కాదా అనే చర్చ జరిగింది. మహాత్మా గాంధీ చేపట్టిన స్వదేశీ ఉద్యమంలో పలువురు హార్మోనియం భారతీయులది కాదంటూ వ్యతిరేకించారు. 1940లో ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగ అధిపతి అందించిన కథనానికి స్పందనగా దాదాపు మూడు దశాబ్దాలపాటు ‘ఆకాశవాణి’లో హార్మోనియం నిషేధించారు. ఈ నిషేధం 1971లో పాక్షికంగా ఎత్తివేశారు. అనంతర కాలంలో ఈ నిషేధాన్ని పూర్తిగా తొలగించారు. ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం పేటెంట్ హార్మోనియం 1700లలో ఐరోపాలో ఆవిర్భవించింది. అనేక మార్పులకు లోనైన తర్వాత ఇది భారతదేశానికి చేరువయ్యింది. దీని మొదటి నమూనాను కోపెన్హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజీ ప్రొఫెసర్ క్రిస్టియన్ గాట్లీబ్ క్రాట్జెన్స్టెయిన్ రూపొందించారని చెబుతారు. దీని తరువాత హార్మోనియంలో అనేక మార్పులు వచ్చాయి. 1842లో అలెగ్జాండ్రే డెబెన్ అనే ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం డిజైన్‌కు పేటెంట్ పొంది, దానికి 'హార్మోనియం' అని పేరు పెట్టారు. హార్మోనియంను 19వ శతాబ్దం చివరలో పాశ్చాత్య వ్యాపారులు, మిషనరీలు భారతదేశానికి తీసుకువచ్చారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం భారతీయ చేతి వాయిద్యంగా మారిన హార్మోనియంను 1875లో కోల్‌కతాలో ద్వారకానాథ్ ఘోష్ రూపొందించారు. అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని.. 1915 నాటికి భారతదేశం హార్మోనియంల రూపకల్పనలో అగ్రగామిగా మారింది. అలాగే ఈ వాయిద్యం భారతీయ సంగీతంలో అంతర్భాగంగా మారింది. హార్మోనియంలో 12 స్వరాలు, 22 శృతులను పలికించవచ్చని చెబుతారు. అయితే భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసులలోని ఒక విభాగం హార్మోనియం అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని, అన్ని శాస్త్రీయ స్వరాలను పరిపూర్ణంగా పలికించే సామర్థ్యాన్ని కలిగి లేదని ఎత్తి చూపింది. దీని గురించి ప్రఖ్యాత హార్మోనియం ప్లేయర్ రవీంద్ర కటోటి మాట్లాడుతూ పరిమితి అనేది విశ్వవ్యాప్త వాస్తవం. ప్రతి స్వరానికి, ప్రతి పరికరానికి దాని పరిమితులు ఉంటాయన్నారు. ఠాగూర్ వాదన ఇదే.. హార్మోనియం భారతీయమా కాదా, ఇది భారతీయ సంగీతానికి సరిపోతుందా లేదా అనే చర్చ నడుస్తున్నప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వాయిద్య పరికరం భారతీయతకు సరిపోదన్నారు. ఇది గమకాలను పలికించలేదన్నారు. ఈ నేపధ్యంలోనే ఆకాశవాణిలో హార్మోనియంను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక సాహితీవేత్త కోల్‌కతాలోని ఆల్ ఇండియా రేడియోకి లేఖ రాశారు. ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగం అధిపతి జాన్ ఫోల్డ్స్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఎంతో అవసరమైన మైక్రోటోన్ల విషయంలో హార్మోనియం మ్యూట్‌గా ఉందని తన కథనాలలో వివరించారు. కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్గా ఉన్న లియోనెల్ ఫీల్డెన్.. ఫోల్డ్స్ వాదనతో ఏకీభవించారు. దీంతో 1940, మార్చి 1న ఆల్ ఇండియా రేడియో హార్మోనియంను నిషేధించింది. స్వాతంత్య్రానంతరం కూడా.. సంగీత విద్వాంసుడు అభిక్ మజుందార్ ఈ అంశం గురించి మాట్లాడుతూ.. కళా చరిత్రకారుడు ఆనంద్ కుమారస్వామి, స్వాతంత్ర్య సమరయోధునిగా జవహర్లాల్ నెహ్రూ కూడా హార్మోనియం భారతీయతకు చెందినది కాదన్నారు. స్వాతంత్య్రానంతరం కూడా ఈ వాయిద్య పరికరంపై నిషేధం కొనసాగిందని, సమాచార ప్రసార శాఖ మంత్రి బివి కేస్కర్, విద్వాంసుడైన గాయకుడు విఎన్ భత్ఖండే విద్యార్థి దీనికి కారణమని తెలిపారు. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
నోట్లపై గాంధీ బొమ్మ బదులు.. ఆర్బీఐ క్లారిటీ
ముంబై: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులుగా వేరే ముఖాలను చూడబోతున్నామంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నోట్లపై గాంధీ ముఖం బదులు.. రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలతో కొత్త కరెన్సీ నోట్లను ముద్రించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పందించింది. సోమవారం మధ్యాహ్నం ఆర్బీఐ ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి కొత్త ప్రతిపాదన లేదని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాళ్ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు ట్విటర్లోనూ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. RBI clarifies: No change in existing Currency and Banknoteshttps://t.co/OmjaKDEuat — ReserveBankOfIndia (@RBI) June 6, 2022 ఇదిలా ఉంటే.. కరెన్సీ నోట్లలో మరిన్ని మేర సెక్యూరిటీ ఫీచర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ సహానికి గాంధీ సహా ఠాగూర్,కలాం ఫొటోలను ఆర్బీఐ పంపిందని, కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో స్థానంలో ఠాగూర్, కలాం ఫొటోల ముద్రణకు సంబంధించి ఆయన నుంచి నివేదిక కోరిందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వాటిపై వివరణ ఇచ్చిన యోగేశ్ దయాళ్ ఆ వార్తలను ఖండించారు. -
ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
కరీంనగర్‌టౌన్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ.. రెండూ ఒక్కటేనని, ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచేస్తోందని, ఆ కుటుంబ పాలనకు తెర దించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాత్రి 8 గంటల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి విపత్కర సంఘటనలు జరిగినా ప్రజలకు అందుబాటులో ఉండని మోడ్రన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్ అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేస్తూ, కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినా ఈడీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే గంగుల కమలాకర్ గ్రానైట్‌స్కాంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మాణిక్యం ‘మార్కు’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మాణిక్యం ఠాగూర్ తన మార్కు చూపెట్టడం మొదలుపెట్టారు. ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకోకుండానే టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి తనను అధిష్టానం తెలంగాణకు ఎందుకు పంపిందో తెలిసేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలను పంపారు. బుధవారం జూమ్ యాప్ ద్వారా దాదాపు 3 గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో సచిన్, ధోని లాంటి క్రీడాకారులున్నారని, కానీ, కలిసికట్టుగా ఆడి, ఎవరి పాత్ర వారు పోషిస్తేనే క్రికెట్ మ్యాచ్‌లో గెలుస్తామన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. రాజకీయాలంటే టెన్నిస్ లాగా వ్యక్తిగతంగా ఆడే ఆట కాదని, క్రికెట్ లాగా సమష్టిగా కృషి చేయాలని హితవు పలికారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ పాలనకు స్వస్తి పలకడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక, మండలి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులను త్వరగా ఎంపిక చేసి కార్యరంగంలోకి దిగాలని సూచించారు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో బూత్, బ్లాక్‌స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి తనకు పంపాలని కోరారు. త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా సీరియస్‌గా తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. పార్టీ నేతలను పరిచయం చేసిన ఉత్తమ్ కోర్ కమిటీ సమావేశానికి ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, పార్టీ ఎంపీలు ఎ.రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, కోర్ కమిటీ సభ్యులు దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్యెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, మధుయాష్కీ గౌడ్, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్ పాల్గొన్నారు. మాణిక్.. ‘భాషా’ రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై అధ్యయనం చేసినట్టు కనిపించిన మాణిక్యం పలు విలువైన సూచనలతోపాటు హెచ్చరికలు కూడా చేశారు. కట్టు తప్పితే సహించేది లేదని, సోషల్ మీడియాను పార్టీ లైన్ ప్రకారమే ఉపయోగించుకోవాలి తప్ప ఇష్టానుసారంగా, వ్యక్తిగతంగా ఉపయోగించుకోవద్దని సూచించారు. ప్రతి 15 రోజులకోసారి కోర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తానని, పార్టీ పరమైన అన్ని అంశాల్లోనూ సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని పాటిద్దామని చెప్పారు. కాగా, మాణిక్యం అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం. -
మంగళగిరి ఆసుపత్రిలో దారుణం
-
మంగళగిరి ఆసుపత్రిలో దారుణం
సాక్షి, గుంటూరు: మంగళగిరి పట్టణంలోని ఓ ఆసుపత్రి దారుణానికి ఒడిగట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన ఓ యువతి మృతి చెందినా.. ఆమెకు రెండు రోజుల పాటు వైద్యం చేసినట్లు నటించిన ఘటన ఠాగూర్ సినిమాను గుర్తుకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్వరూప అనే యువతి రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆమెను హుటాహుటిన మంగళగిరిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీళ్లతో ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స చేస్తున్నామని స్వరూప ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు భరోసానివ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల అనంతరం స్వరూప చనిపోయిందని, మిగిలిన డబ్బు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. దీంతో నిర్గాంతపోయిన స్వరూప కుటుంబసభ్యులు ఆసుపత్రి తమను మోసం చేసిందని ఆరోపించారు. స్వరూప ముందే మరణించినా ఆ విషయాన్ని బయటపెట్టకుండా వైద్య అవసరాలకు రూ.1.50 లక్షలు గుంజారని, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని చెప్పారు. -
ఠాగూర్ మూవీలా.. వైద్యం చేస్తున్నట్లు నటించి..
హైదరాబాద్: ఠాగూర్ సినిమాలోలా చనిపోయిన వ్యక్తికి వైద్య చికిత్సలు చేసి ఆస్పత్రి నిర్వాహకులు డబ్బులు కట్టించుకున్న తీరు మాదిరే శేరిలింగంపల్లిలోని సిటిజన్ ఆస్పత్రి వైద్యులు దారుణానికి ఒడిగట్టారు. నిజామాబాద్‌కు చెందిన నగబుష్ణరావు(60) అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం సిటిజన్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయాన్ని నగబుష్ణరావు కుటుంబసభ్యులకు చెప్పకుండా దాచిన సిటిజన్ ఆసుపత్రి వైద్యులు మరో 27 గంటలపాటు ఆయనకు వైద్యం చేస్తున్నట్లు నటించారు. మధ్యలో చికిత్సల కోసం అంటూ రెండు విడతలుగా రూ.6.5లక్షల బిల్లు కట్టించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు నగబుష్ణరావు చనిపోయినట్లు చెప్పారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం, ధనదాహం వల్లే నగబుష్ణరావు ప్రాణాలు కోల్పోయారని ఆయన బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. -
చిరు కోసం వినాయక్ రీసెర్చ్
ఇంతవరకు పట్టాలెక్కకపోయినా... చిరంజీవి 150 సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తూనే ఉంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని, గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమాను మించే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఠాగూర్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్స్ అప్పట్లో సెన్సేషన్. అందుకే ఈ తాజా చిత్రంలోనూ అలాంటి డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఠాగూర్ తరహా డైలాగ్ ను ప్లాన్ చేస్తున్నాడు వినాయక్. అందుకోసం భారీగా రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల అప్పుడు, ఆత్మహత్యలు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ కేటాయింపులు లాంటి విషయాలతో ఓ లెంగ్తీ డైలాగ్ ను రెడీ చేస్తున్నారు. మరీ డైలాగ్ కత్తిలాంటోడికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్‌పై చీటింగ్ కేసు
తెలంగాణ సినిమా అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ కార్యదర్శి ఠాగూర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా జవహర్కాలనీలో గత ఏడాది తెలంగాణ సినిమా అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ను తెరిచారు. ఈ సంస్థలో చాలా మంది లక్షన్నర రూపాయలు చెల్లించి గుర్తింపు కార్డులు తీసుకున్నారు. ఈ సంస్థలో గుర్తింపు కార్డు తీసుకున్న వి.శ్రీనివాస్ అనే యువకుడి.. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించగా.. తన గుర్తింపు కార్డుకు విలువ లేదన్నారు. ఈ కార్డు చెల్లదని షూటింగుల వద్ద నుంచి వెనక్కి పంపివేశారు. దీంతో విషయం యూనియన్ కార్యదర్శి ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఠాగూర్ నుంచి ఎటువంటి స్పందన లేక పోవడంతో.. ఇదే యూనియన్ లో రిజిస్టర్ చేసుకున్న 83 మంది యువకులు ఇలాగే మోసపోయారని తెలుసుకున్నాడు. ఠాగూర్ తమను మోసం చేశాడని ఆరోపిస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెజవాడలో బతుకమ్మ
బతుకమ్మ... ఓ ఇంద్రధనస్సు ‘ప్రపంచంలో మరెక్కడా కనిపించని పండుగ బతుకమ్మ.. ప్రకృతితో మమేకమై జరుపుకునే అతి పెద్ద సంబురం.. ఇంద్రధనస్సును తలపించేలా బతుకమ్మలోని పూల వర్ణాలు ఉండడం అద్భుతం’ అంటారు ఠాగూర్, గుర్రం జాషువా అవార్డు గ్రహీత కోవెల సుప్రసన్నాచార్య. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన కవిగా, రచయితగా ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. ఈ మేరకు బతుకమ్మ పండుగ ప్రత్యేకత, తన చిన్ననాటి సంగతులను ‘సాక్షి’కి వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. కాకతీయులు చాలా గొప్ప రాజులు. పంచాయన దేవతలైన ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరులను ఆరాధించారు. ఒక్క వేయి స్తంభాల ఆలయంలోనే శివుడు, కేశవుడు, ఆదిత్యుడు ఉండడం కనిపిస్తుంది. బతుకమ్మ పండుగ కాకతీయుల కాలంలోనూ, అంతకుముందు కూడా ఉండి ఉండవచ్చు కానీ అందుకు ఆధారాలు లేవు. గణపతి నవరాత్రుల తర్వాత బొడ్డెమ్మ పండుగ, ఆ తర్వాత బతుకమ్మ పండగ జరుపుకోవడం యాదృచ్ఛికం కాదు. శ్రీ చక్ర ంలో నాలుగు దళాల మధ్య గణపతి మూలధారా చక్రంలో బీజాక్షరం దగ్గర ఉంటాడు. కుటుంబంంలో పెళ్లిళ్లు, ఇతర ఏ శుభకార్యాలు జరిగినా కూడా గారెలు చేస్తారు. అవి పితృలకు శ్రాద్ధకర్మల కోసం ప్రతి పనికి పితృదేవతలకు పూజించాలి. ఆ విధంగా పెత్రమాసతోనే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. మూలపుటమ్మ.. ప్రకృతిని తల్లిగా చూస్తాం కాబట్టి భూ మాత అంటాం. కనకదుర్గ అంటాం. ఇవి దేవతా అర్చనలో కొన్ని భాగాలు. ఇన్ని పూలను కలుపుకుని అర్థించడం అనేది ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. దానికి బతుకమ్మ అని పేరు పెట్టారు. శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా అంటూ లక్ష్మి, గౌరి, పార్వతి, సరస్వతి అందరి పేర్లు వస్తాయి. బతుకమ్మను ముగ్గురమ్మల మూలపుటమ్మ అంశంగా చూశారు. తొమ్మిది రోజుల పాటు అమంత్రకంగా (మంత్రాలు లేకుండా) ఉపాసన చేస్తారు. పాటలు పాడుతారు. నృత్యాలు చేస్తారు. చతుఃషష్టి ఉపచార పూజలలో కూడా సంగీతం, నృత్యం దర్శయామీ అంటారు కదా. సూర్య చంద్రులు కలిసే ఉంటారు సద్దుల బతుకమ్మ రోజు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు కలిసే ఉంటారు. దుర్గ అమ్మవారికి చంద్ర విద్య, చంద్ర సహోదరి అని పేరు. సూర్య మండలంలో మద్రస్తురాలిగా ఉండే దేవత అని పిలుస్తారు. చల్లని తల్లిగానూ ఉగ్రకాళీగా ఉంటుంది. దుర్అంటే దుర్లభమైనది, వెళ్లలేనిది అని అర్థం. గ అంటే వెళ్లాల్సినది అని అర్థం. రెండు అంశలు కలిసి దుర్గ అయింది. సామాన్యులు జరుపుకునేది.. వైదిక సంప్రదాయం హోమాలతో సంబంధం లేకుండా సామాన్యులు జరుపుకునేది బతుకమ్మ పండగ. మహిళను దేవతగా భావించి సమాజంలో భాగంగా చేశారు. ఇదే విధంగా సువాసినీ పూజ సంప్రదాయం కనిపిస్తుంది. మహిళలు తమ పుట్టింటి, మెట్టినింటి వారందరూ బాగుం డాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. రెండు భిన్నమైన కుటుంబాల మధ్య కలిసిపోవడం కనిపిస్తుంది. ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ దశ మహావిద్యల్లో భగళామాత శత్రువును మాట్లాడకుండా అడ్డుకుంటుంది. అందుకే దీక్షలో ఉన్నవారు భగళాదేవికి ఇష్టమైన పసుపు బట్టలే కడుతారు. అందుకే పసుపు వర్ణంతో కూడిన తంగేడు పూలకు ప్రాధాన్యం ఉంటుంది. జీవితానికి పరిపూర్ణతను ఇస్తుంది. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జామాయే చందమామ అంటూ పాడుతారు. ఈ విధంగా ఏకోత్తర వృద్ధిలో ఒక్కొక్కటి పెంచుకుంటూ పోవడం ఆత్మసమర్పణకు ప్రతీక. ఇన్ని రంగుల పూలతో బతుకమ్మ ఇంద్రధనస్సులా అవుతుంది. భేదాలు ఉండవు.. బతుకమ్మ పండుగ సమయంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే భేదాలు మరిచిపోతారు. సద్దుల వద్ద ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటారు. ప్రసాదాలు పంచుకుంటారు. పండుగ సమయంలో కొత్తగా పెళ్లయిన వారికి శిక్షణ ఇవ్వడం కనిపిస్తుంది. బెజవాడలో బతుకమ్మ ఆడిన గుర్తు 1948లో జిల్లాలో దుర్లభమైన పరిస్థితి. రజాకారుల అకృత్యాలు పెరిగిపోయాయి. వందలాది కుటుంబాలు వలస వెళ్లాయి. మా కుటుంబాలు కూడా విజయవాడ, రాజమండ్రి, ఏలూరు తదితర చోట్లకు వలస వెళ్లిపోయాయి. మళ్లీ వస్తమో రామో కూడా తెలియదు. అప్పుడు బతుకమ్మ పండుగను విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో కృష్ణా నది ఒడ్డున జరుపుకున్నాం. గునుగుపువ్వు, తంగేడు పువ్వు ఎలా తెచ్చుకున్నారో తెలియదు కానీ వందలాది మంది తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకుని కృష్ణానదిలో బతుకమ్మలను వదలడం ఇప్పటికి నా కళ్ల ముందు కదలాడుతోంది. అప్పడు నా వయస్సు 12 ఏళ్లు. విజయవాడ ప్రజలు ఆశ్చర్యపోయి చూశారు. పోలీస్ చర్య తర్వాత మళ్లీ ఇక్కడకు తిరిగి వచ్చాం. వరంగల్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం ఎన్నడూ బతుకమ్మ పండుగలో పాల్గొనడం చూడలేదు. వరంగల్‌లో ఎడ్లబండ్ల మీద భారీ బతుకమ్మలను పెట్టుకుని వెళ్లేవారు. మొదటి నుంచి ఇప్పటిలాగే వైభవంగా జరుగుతోంది. -
క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాజమౌళి!
సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో క్షమాపణలు చెప్పారు. అల్లుడు శీను ఆడియో కార్యక్రమంలో 'నేను టాగోర్ కు బదులు స్టాలిన్ అన్నాను'. మన్నించండి అంటూ రాజమౌళి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 'అల్లుడు శీను' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. వీవీ వినాయక్ ఎమోషనల్ పర్సన్. పేపర్లో వార్తలకే కంటతడి పెడ్డారని.. స్టాలిన్ చిత్రానికి కష్టపడిన దానికన్నా వినాయక్ ఈ సినిమాకు ఎక్కువ కష్టపడ్డారని రాజమౌళి అన్నారు. చిరంజీవి నటించిన టాగోర్ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. టాగోర్ అనడానికి బదులు స్టాలిన్ అని చెప్పడంపై రాజమౌళి ట్విటర్ లో వివరణ ఇచ్చారు. Follow @sakshinews Apologies.. I said Stalin instead of Tagore yesterday in alluduseenu audio launch.. — rajamouli ss (@ssrajamouli) June 30, 2014 -
ఠాగూర్ లాంటి సినిమా తీస్తా
చాగల్లు, న్యూస్‌లైన్ : కష్టించి పనిచేసే వారికి చిత్ర పరిశ్రమలో తప్పక గుర్తింపు ఉంటుందని గబ్బర్‌సింగ్ చిత్ర డెరైక్టర్ హరీష్‌శంకర్ అన్నారు. చాగల్లులో తెలగా సంఘం వినాయకుడి ఆలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సినిమా ప్రారంభించే ముందు చాగల్లు వినాయకుడి ఆలయంలో పూజ చేయడం అలవాటుగా మారిందన్నారు. త్వరలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా సినిమా ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇది తన ఐదో చిత్రమని అన్నారు. దర్శకుడు వీవీ వినాయక్ సోదరుడు లాంటి వారని, సినీ రంగంలో తననెంతగానో ప్రోత్సహించారని చెప్పారు. ఠాగూర్ లాంటి సందేశాత్మక చిత్రాలను తీయడమే తన లక్ష్యమన్నారు. యువతను ఆకట్టుకునేలా చిత్రాలు తీస్తానని చెప్పారు. హరీష్ శంకర్‌ను మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్ర కుమార్, ఏఎంసీ డెరైక్టర్ జుట్టా కొండలరావు, జూనియర్ ఆర్టిస్టులు దొమ్మేటి సత్యనారాయణమూర్తి, జి.సూరిబాబు, పంగిడి వెంకట్రావు, కె.పుట్టయ్య దుశ్శాలువాతో సత్కరించారు. -
రవి కాంచిన కళ
సౌందర్యాన్ని ఆరాధించడం, అధ్యయనం చేయడం, ఆస్వాదించడం ద్వారా కళలోని అనుభూతి, ఆనందాలను సొంతం చేసుకోగలం. అలా సొంతం చేసుకున్న కళాపిపాసి రవీంద్రనాథ్ ఠాగూర్. చిత్రకళలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ తనదైన శైలిని ప్రతిబింబించారు. పాశ్చాత్య చిత్రకారులు చార్లెస్ పామర్, గిలార్డ్ వద్ద చిత్రలేఖనం నేర్చుకున్నప్పటికీ తాను గీసిన చిత్రాల్లో భారతీయ ఆత్మను ప్రదర్శించారు. మిగిలిన చిత్రకారుల మాదిరిగా ముదురురంగుల్లో కాకుండా... నీటిరంగుల్లో, లేతరంగుల్లో, వివిధ మాధ్యమాల్లో చిత్రాలు వేశారు ఠాగూర్. సిరా, పేస్టల్స్‌తో కూడా చిత్రాలు రూపొందించారు. రవీంద్రుడికి అమితంగా నచ్చిన అంశం ప్రకృతి. జీవితంలో ఎక్కువగా భాగం ప్రకృతితో సంభాషణ చేయడానికి ఇష్టపడిన తాత్వికుడు ఠాగూర్. ఆయన గీసిన చిత్రాల వలన కలిగే అనుభూతి కాలాతీతమైనది. ఎప్పుడూ గుర్తుండి పోయేది. కృతకమైన అలంకరణలు, ఆడంబరాలు నిజమైన ప్రేమకు అడ్డుగోడగా నిలుస్తాయని ఆయన నమ్మకం. అందుకే అలంకరణను వదిలి భావవ్యక్తీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిరాడంబరమైన చిత్రాలనేకం ఆయన కుంచె నుంచి జాలువారాయి. ఆయనకు సంగీతం కూడా ఇష్టమైనదే కావడంతో చిత్రాల్లో ‘లయ’ కనబడుతుంది. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రవీంద్రునికి ముందే అనేక మంది చిత్రరచన చేసినా ‘బెంగాలీ సంప్రదాయం’ ఠాగూర్ నుంచి వచ్చినదే. యూరప్‌లో వచ్చిన సాంస్కృతిక పునర్జీవనం లాంటిది బెంగాలీ చిత్రకళలో తీసుకువచ్చారు. రవీంద్రుని ద్వారా బెంగాల్ చిత్రకళ సరికొత్త ఉత్తేజాన్ని పొందింది. తాత్వికుడైన ఠాగూర్ దృష్టిలో కళాసృష్టి అంటే- ‘‘అంధకారబంధురమైన ఈ లౌకిక ప్రపంచంలో కొట్టుమిట్టాడే వారికి అనంత సౌందర్య ప్రపంచంలో సర్వేశ్వరుడు దర్శనమిస్తాడు’’ సౌందర్యపిపాసి అయిన ఠాగూర్ తన ఊహాసుందరి, కళాప్రేయసిని ఊహిస్తూ... ‘‘ఒక శూన్య సంతోషం నాలో నిండనీ నా చేతిని నీ చేతిలో తీసుకో అంతే చాలు చీకటి పరుచుకునే నిశివేళ నా హృదయం నీదిగా చేసుకో’’ అంటారు. రవీంద్రుడు దాదాపు మూడువేల చిత్రాల్ని సృష్టించాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. రవీంద్రుడి చిత్రాలలో ఆధునికతతో పాటు సంప్రదాయం కూడా ఉండడం వలన అవి అందరినీ ఆకట్టుకున్నాయి. మన మనోసీమలో పదిలంగా నిలిచిపోతాయి. ఇంగ్లండ్, డెన్కార్క్, రోమ్, జర్మనీ, స్వీడన్, రష్యాలలో రవీంద్రుని చిత్రప్రదర్శనలు జరిగాయి. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కు రవీంద్రుడి చిత్రాలంటే ఇష్టంగా ఉండేది. కవిత్వంలో, చిత్రాల్లో ప్రకృతిని సాక్షాత్కరింప చేసిన ఠాగూర్ మన మధ్య లేకపోయినా ఆయన గీసిన చిత్రాలు మాట్లాడుతూనే ఉంటాయి. రవీంద్రుడిని మన మధ్య నిలుపుతూనే ఉంటాయి. - రామశాస్త్రి (కవి, చిత్రకారుడు)