ఠాగూర్ మూవీలా.. వైద్యం చేస్తున్నట్లు నటించి..
హైదరాబాద్: ఠాగూర్ సినిమాలోలా చనిపోయిన వ్యక్తికి వైద్య చికిత్సలు చేసి ఆస్పత్రి నిర్వాహకులు డబ్బులు కట్టించుకున్న తీరు మాదిరే శేరిలింగంపల్లిలోని సిటిజన్ ఆస్పత్రి వైద్యులు దారుణానికి ఒడిగట్టారు. నిజామాబాద్‌కు చెందిన నగబుష్ణరావు(60) అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం సిటిజన్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ చనిపోయారు.
ఈ విషయాన్ని నగబుష్ణరావు కుటుంబసభ్యులకు చెప్పకుండా దాచిన సిటిజన్ ఆసుపత్రి వైద్యులు మరో 27 గంటలపాటు ఆయనకు వైద్యం చేస్తున్నట్లు నటించారు. మధ్యలో చికిత్సల కోసం అంటూ రెండు విడతలుగా రూ.6.5లక్షల బిల్లు కట్టించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు నగబుష్ణరావు చనిపోయినట్లు చెప్పారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం, ధనదాహం వల్లే నగబుష్ణరావు ప్రాణాలు కోల్పోయారని ఆయన బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.