నరసన్నను దర్శించుకున్న వినాయక్, హీరో శ్రీనివాస్
నరసన్నను దర్శించుకున్న వినాయక్, హీరో శ్రీనివాస్
Published Sun, Aug 6 2017 11:36 PM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM
అంతర్వేది (సఖినేటిపల్లి) : స్థానిక శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆదివారం ప్రముఖ చిత్ర దర్శకుడు వినాయక్, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకట శాస్త్రి, అభిమానులు స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ‘జై జానకి నాయకా’ చిత్రం త్వరలో విడుదల అవుతున్న సందర్భంగా ఆ చిత్రం హీరో సాయిశ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. చిత్రం విజయవంతం కావాలని ఆయన స్వామిని వేడుకున్నారు. సి. కల్యాణ్ నిర్మాతగా మెగా ఫ్యామిలీ మెంబర్ సాయిధరమ్ తేజ్ హీరోగా సీకే ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై నిర్మించనున్న కొత్త చిత్రం స్క్రిప్టును దర్శకుడు వినాయక్ స్వామివారి పాదాల చెంతన ఉంచి పూజలు చేశారు. వారి వెంట ట్రస్టీలు వీరా మల్లిబాబు, తిరుమాని ఆచార్యులు, యెనుముల శ్రీరామకృష్ణ, శంకరగుప్తం శ్రీనుబాబు, సీనియర్ అసిస్టెంట్ పి. విజయ సారధి, జూనియర్ అసిస్టెంట్ ఎం. సత్యకిరణ్ ఉన్నారు.
రాబోయే సినిమా మినీ ఠాగూర్‌లా ఉంటుంది
మలికిపురం : తన దర్శకత్వంలో రానున్న సినిమా మినీ ఠాగూర్‌లా ఉంటుందని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. మలికిపురంలో కంచుస్తంభం వాసు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సి. కల్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందన్నారు. ఆయన వెంట కంచుస్తంభం వాసు, లింగోలు మహేష్, బొలిశెట్టి శ్రీను, అబ్దుల్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement