గ్రామీణ ప్రేమకథగా వస్తోన్న 'రాధా మాధవం'..! | Nuvvu Nenu Unna Video Song Released From Radhaamadhavam Movie | Sakshi
Sakshi News home page

Radhaamadhavam Movie: గ్రామీణ ప్రేమకథగా ‘రాధా మాధవం’.. క్రేజీ సాంగ్ రిలీజ్!

Published Mon, Dec 25 2023 9:01 PM | Last Updated on Mon, Dec 25 2023 9:01 PM

Nuvvu Nenu Unna Video Song Released From Radhaamadhavam Movie - Sakshi

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధా మాధవం'. ఈ చిత్రానికి దాసరి ఇస్సాక్ దర్శకత్వం వహిస్తున్నారు.  గ్రామీణ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గోనాల్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు.  

తాజాగా ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'నువ్వు నేను' అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. సమీరా భరద్వాజ్, రవి జీ ఆలపించారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

జనవరి నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో మేక రామకృష్ణ, జయ ప్రకాశ్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement