
ఇండోర్ : మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్‌కు దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య రోజు ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఇండోర్ డీఐజీ హరి నారాయణచారి మిశ్రా తెలిపారు. ఆ ఆస్తులకు సర్వహక్కులు భయ్యూ నమ్మిన బంటు వినాయక్‌కు చెందాలని తన సూసైడ్ నోట్‌లో రాసుకున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం భయ్యూ మహారాజ్ పేరున ఉన్న ఆస్తులు ఇకపై వినాయక్‌కు చెందుతాయని మిశ్రా స్పష్టం చేశారు.
వినాయక్ గత పదిహేనేళ్లుగా భయ్యూ మహారాజ్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. ఆయన చేసే ప్రతిపనిలో వినాయక్ పాలుపంచుకున్నారు. ఈ కారణంగానే యావదాస్తిని వినాయక్‌కు చెందేలా సూసైట్ నోట్ రాశారని భావిస్తున్నారు. ఈ ఆస్తులపై భయ్యూ కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కులు ఉండవని డీఐజీ తెలిపారు. చట్టబద్ధంగా 1000 కోట్ల ఆస్తి ఉన్న భయ్యూకు లెక్కల్లో లేని ఇతర ఆస్తులు ఇంకా చాలా ఉండి ఉంటాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. అయితే ఈ సూసైడ్ నోట్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తిని కాజేయండంలో భాగంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇది చదవండి : అసలెవరీ భయ్యూజీ? ఆసక్తికర నిజాలు , ఆధ్యాత్మిక గురువు ఆత్మహత్యకు కారణం..?