నిర్మాతగా మారుతున్న స్టార్ డైరెక్టర్ | vinayak To produce Tanikella Bharani Short Film | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారుతున్న స్టార్ డైరెక్టర్

Published Sat, Jul 30 2016 10:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

నిర్మాతగా మారుతున్న స్టార్ డైరెక్టర్

నిర్మాతగా మారుతున్న స్టార్ డైరెక్టర్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులుగా ఉన్న చాలా మంది, నిర్మాతలుగా మారి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. మరో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా అదే బాటలో నడవడానికి రెడీ అవుతున్నారు. అయితే మిగిలిన దర్శకుల్లా సినిమాతో కాకుండా ఓ ష్టార్ ఫిలింతో నిర్మాతగా మారుతున్నారు వినాయక్. ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ఈ షార్ట్ ఫిలింను డైరెక్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే సిరా, మిథునం లాంటి సినిమాలతో దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న తనికెళ్ల భరణి, లాస్ట్ ఫార్మర్ పేరుతో ఓ షార్ట్ ఫిలింను రూపొందిస్తున్నారు. ఈ కథ నచ్చిన వినాయక్ తానే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న వినాయక్, తాజాగా ఈ నిర్మాణ బాధ్యతలను కూడా తలకెత్తుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement