మరోసారి ఐటమ్ నంబర్లో.. | tamanna 2nd item number in belamkonda srinivas 2nd film | Sakshi
Sakshi News home page

మరోసారి ఐటమ్ నంబర్లో..

Published Sat, Oct 31 2015 8:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

మరోసారి ఐటమ్ నంబర్లో..

మరోసారి ఐటమ్ నంబర్లో..

పదేళ్ల సినీ కెరీర్లో ఒకే ఒక్కసారి స్పెషల్ సాంగ్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా, మరోసారి అదే సాహసానికి రెడీ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయిన అల్లుడు శీను సినిమా కోసం స్పెషల్ సాంగ్లో ఆడిపాడింది ఈ బ్యూటీ. అయితే కొత్త హీరోతో చిందేసినందుకు భారీ మొత్తాన్నే రెమ్యూనరేషన్గా అందుకుంది. అప్పట్లో కెరీర్ ఆశించిన స్ధాయిలో లేదు కాబట్టి ఐటమ్ నంబర్ను కూడా ఓకే చేసింది తమన్నా.

ఇప్పుడు పరిస్థితులు వేరు, బాహుబలి రిలీజ్ తరువాత తమన్నా క్రేజ్ భారీగా పెరిగింది. నేషనల్ లెవల్లో తమన్నా అందాలకు మంచి మార్కులు పడ్డాయి. అలాంటిది ఈ సమయంలో కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది. మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కోసమే ఈ స్టార్ హీరోయిన్ ఐటమ్ బ్యూటీగా మారనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న శ్రీనివాస్ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించిన చిత్రయూనిట్ భారీ ఆఫర్తో తమన్నా డేట్స్ తీసుకున్నారట.

వివి వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అల్లుడు శీను ఆశించిన స్ధాయి విజయం సాధించకపోవటంతో, ఈసారి రీమేక్ సినిమాను నమ్ముకున్నాడీ యువ హీరో. తమిళంలో ఘనవిజయం సాదించిన సుందరపాండియన్ సినిమాను భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement