పవన్ కల్యాణ్కు ఫ్యాన్ అయిన బాలీవుడ్ హీరో | Iam Pawan Kalyan Fan, says vivek oberoi | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్కు ఫ్యాన్ అయిన బాలీవుడ్ హీరో

Published Sun, Jun 15 2014 4:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పవన్ కల్యాణ్కు ఫ్యాన్ అయిన బాలీవుడ్ హీరో - Sakshi

పవన్ కల్యాణ్కు ఫ్యాన్ అయిన బాలీవుడ్ హీరో

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు టాలీవుడ్లోనే గాక కర్ణాటక, తమిళనాడులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ అభిమానుల్లో కొంతమంది తెలుగు యువ హీరోలూ ఉన్నారు. విశేషమేంటంటే పవన్ ఫ్యాన్ క్లబ్లో ఓ బాలీవుడ్ హీరో చేరారు. అతనే రక్తచరిత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ యువ హీరో వివేక్ ఒబెరాయ్. తాను పవన్ అభిమానినని, ఆయన తనకు అన్నలాంటి వారని వివేక్ స్వయంగా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కల్యాణ్తో పాటు వివేక్ ఒబెరాయ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్తో వివేక్ ప్రత్యేకంగా ముచ్చటించారు. అనంతరం వివేక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ను ప్రశంసల్తో ముంచెత్తారు. ఆరేళ్ల క్రితం తాను పవన్ను కలిశానని, అప్పటికే తాను ఆయన అభిమానినని చెప్పారు. ఇప్పుడు ఆయనంటే మరింత గౌరవం పెరిగిందని, తనకు అన్నలాంటి వారని వివేక్ అన్నారు. సినిమాలు, సేవాకార్యక్రమాల విషయంలో పవన్ బాటలో తాను నడుస్తున్నాని చెప్పారు. త్వరలో పవన్ను కలిసి ఆయన సలహాలు తీసుకుంటానని అన్నారు. కాగా తనకు రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానం వచ్చినా నిరాకరించానని, సేవా కార్యక్రమలు చేపడుతానని వివేక్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement