ఆత్మహత్యకు పాల్పడ్డ పవన్ వీరాభిమాని అనిల్(పాత చిత్రం)
సాక్షి, విజయవాడ: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడకు చెందిన కొమరవల్లి అనిల్ కుమార్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని తల్‌వాకర్స్ జిమ్‌లో ట్రైనర్‌గా అనిల్ పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అతడు డిప్రెషన్‌లో ఉన్నట్టు తెలిసింది. చనిపోయే ముందు పవన్ కల్యాణ్‌కు అనిల్ ఓ లేఖ రాశారు. దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్, తాను చనిపోయిన తర్వాత చూడటానికి రావాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అంత్యక్రియలు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment