
‘అమరులకు’ వివేక్ సాయం
న్యూఢిల్లీ: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది జవాన్ల కుటుంబాలకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అండగా నిలిచారు. మహారాష్ట్రలో థానే సమీపంలోని తన కర్మ్ రెసిడెన్సీ, కర్మ్ పంచతత్వా వెంచర్లలో 25 ఫ్లాట్లను అమరుల కుటుంబాలకు అందిస్తానని చెప్పారు.
ఇప్పటికే నాలుగు ఫ్లాట్లను అందించామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జాబితా అందిన వెంటనే మిగతావి కేటాయిస్తామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి విరాళాల కోసం కేంద్ర హోంశాఖ ఇటీవల www. bharatkeveer. gov. in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.