25న పేదింటి యువతి వివాహం | Poor Girl Marriage Help To People | Sakshi
Sakshi News home page

25న పేదింటి యువతి వివాహం

Published Mon, Dec 23 2024 2:23 PM | Last Updated on Mon, Dec 23 2024 3:01 PM

Poor Girl Marriage Help To People

  దాతల సాయం కోసం ఎదురుచూపులు

ఎలిగేడు(పెద్దపల్లి): ఓ పేదింటి యువతి వివాహం ఈనెల 25న నిశ్చయం కాగా.. చేతిలో చిల్లి గవ్వ లేక దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన చీకటి లక్ష్మి–కీ.శే.రామస్వామిల చిన్న కూతురు ప్రత్యూష వివాహం నరసింహులపల్లి గ్రామానికి చెందిన బుర్ర సతీశ్‌తో ఈనెల 25న బుధవారం జరగనుంది. 

ప్రత్యూష తండ్రి రామస్వామి పేగు క్యాన్సర్‌తో పదేళ్ల క్రితం మృతిచెందగా.. తల్లి లక్ష్మికి మతిస్థిమితం సరిగా లేదు. అన్న, వదినలు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు. వీరి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యూషను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన పెళ్లి కుమారుడు ఆదర్శంగా నిలిచాడు. ఐతే పెళ్లికి కనీసం పుస్తెలు, మట్టెలు, పెళ్లి కానుకలు, ఖర్చులకు చిల్లి గవ్వ లేక ఆ కుటుంబం దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చ‌ద‌వండి: సొంత తమ్ముడే సూత్రధారి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement