Poor girl
-
Safeena Husain: ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్
పేదరికంలో పుట్టిన దిల్లీకి చెందిన సఫీనా హుసేన్ చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరింది. లండన్‌లో చదువుకున్న సఫీనా అమెరికాలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత మన దేశానికి తిరిగి వచ్చి పేదింటి ఆడపిల్లలు బడి బాట పట్టడానికి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఎన్నో రాష్ట్రాలలో వేలాదిమంది ఆడపిల్లలు చదువుకోగలిగేలా చేసింది. తాజాగా... ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో కృషి చేస్తున్న వారికి ‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్, ఖతర్’ వారు ఇచ్చే ‘వైజ్’ప్రైజ్‌కు ఎంపికైంది. ఈ ప్రైజుకు ఎంపికైన ఫస్ట్ ఇండియన్ సఫీనా హుసేన్ గురించి... ‘అబ్బాయిని స్కూలుకు పంపిస్తున్నారు కదా. మరి అమ్మాయిని ఇంటిపనులకే పరిమితం చేస్తున్నారేమిటి?’ అని అడిగినప్పుడు ఆ ఇంటిపెద్ద నవ్వుతూ ఇచ్చిన సమాధానం.... ‘ఆడపిల్లలకు చదువెందుకు. ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సిందే కదా’ ఇంచుమించు ప్రతి ఇంటి నుంచి ఇలాంటి సమాధానమే వినిపించింది. ‘ఆడపిల్లలకు విద్య’ అనే నినాదం ప్రాధాన్యతకు నోచుకోని ఎన్నో ప్రాంతాలను చూసింది సఫీనా. దీనికి పేదరికం ఒక కారణం అయితే, ఆర్థికస్థాయి బాగున్నా ‘ఆడపిల్లకు చదువెందుకు’ అనే నిర్లిప్తత మరోకారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపిల్ల బడికి వెళ్లాలనే లక్ష్యంతో ‘ఎ డ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సఫీనా. ‘ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దానితో మమేకం కావాలి’ అంటున్న సఫీనాకు పేదరికం అనేది అపరిచిత సమస్య కాదు. దిల్లీలోని ఒక పేదకుటుంబంలో పుట్టింది. ఎన్నో కష్టాల మధ్య కూడా ‘చదువు’ అనే ఆయుధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ కుటుంబం నుంచి లండన్‌లో చదువుకున్న తొలి వ్యక్తి అయింది. లండన్ నుంచి అమెరికాకు వెళ్లి స్వచ్ఛంద సేవారంగంలో పని చేసిన సఫీనా 2005లో స్వదేశానికి తిరిగి వచ్చింది. ‘చదువుకోవడం వల్ల నేను ఎంతో సాధించాను. దేశదేశాలు తిరిగాను. చదువుకోకపోతే నా పరిస్థితి ఊహకు కూడా అందనంత దయనీయంగా ఉండేది’ అనుకున్న సఫీనా హుసేన్ పేదింటి ఆడపిల్లల చదువు కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ప్రభుత్వ సంస్థల నుంచి వివరాలు సేకరించింది. చదువుకు సంబంధించి జెండర్–గ్యాప్ ఉన్న 26 జిల్లాల గురించి తెలుసుకుంది. అందులో తొమ్మిది రాజస్థాన్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లో ఆడపిల్లల చదువుకు దూరంగా ఉన్న ప్రాంతాలను మొదట ఎంపిక చేసుకుంది సఫీనా బృందం. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకులతో ‘ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్’ను ఏర్పాటు చేసి ‘దయచేసి మీ అమ్మాయిని స్కూల్‌కు పంపించండి’ అంటూ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ‘ఆడపిల్లలకు చదువు’ అనే అంశంపై గ్రామ సమావేశాలు ఏర్పాటు చేశారు. సఫీనా ఆమె బృందం కృషి వృథా పోలేదు. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది ఆలోచన తీరులో మార్పు వచ్చింది. తమ ఇంటి ఆడపిల్లలను స్కూలుకు పంపించడం ప్రారంభించారు. చాలా బడులలో ఆడపిల్లల కోసం టాయిలెట్ సదుపాయాలు లేవు. అలాంటి బడులలో ప్రత్యేక టాయిలెట్లు నిర్మించేలా చేశారు. బడిలో అకాడమిక్ పాఠాలు మాత్రమే కాకుండా లైఫ్స్కిల్స్కు సంబంధించిన పాఠాలు కూడా చెప్పేవారు. ‘ఆడపిల్లలకు చదువు దూరం కావడం అనేది ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది పితృస్వామిక భావజాలానికి సంబంధించింది. మేము పనిచేసిన కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంటి ఆడపిల్ల కంటే గొర్రెలు, మేకలను విలువైన ఆస్తిగా భావించడం చూశాం. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకు రావాలనుకున్నాం. అది అంత తేలిక కాదని తెలిసినా రంగంలోకి దిగాం. ప్రభుత్వ సంస్థల నుంచి లోకల్ వాలెంటీర్స్ వరకు కలిసి పనిచేశాం. అయితే మేము నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు’ అంటుంది సఫీనా. ‘ఆడపిల్లలకు చదువు అందని ప్రాంతాలు ఏమిటి?’ అనే అంశంపై ఒకప్పుడు ప్రభుత్వ సంస్థల డాటాపైన ఆధారపడిన సఫీనా బృందం ఇప్పుడు డాటా ఎనాలటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. జియో–ట్యాగ్డ్ టార్గెట్ విలేజెస్ నుంచి మొబైల్ ఫోన్స్‌లో డాటా సేకరిస్తున్నారు. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని ఉత్తమఫలితాలు సాధించడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. గతాన్ని గట్టిగా గుర్తు పెట్టుకున్న సఫీనా హుసేన్ ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది పేదింటి అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా కృషి చేస్తోంది. అయినా వెనకడుగు వేయలేదు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’తో తొలి అడుగులు వేసినప్పుడు ‘మీలాగే చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు’ అని నిరుత్సాహపరిచారు కొందరు. అయితే అలాంటి మాటలను మేము సీరియస్‌గా తీసుకోలేదు. ‘ఫలితం వచ్చేవరకు మా ప్రయత్నం’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బయటి వాళ్లు చెప్పే మాటల కంటే తమ ఊరి వాళ్లు చెప్పే మాటలకే గ్రామస్థులు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో స్థానికులతో కలిసి ఆర్మీ ఆఫ్ జెండర్ ఛాంపియన్స్‌ను ప్రారంభించి ఆడపిల్లల విద్యకు సంబంధించి ఇంటింటి ప్రచారం నిర్వహించాం. – సఫీనా హుసేన్, ఫౌండర్, ఎడ్యుకేట్ గర్ల్స్ -
వాట్సాప్.. నీకు హ్యాట్సాఫ్
సాక్షి,గౌతంనగర్(హైదరాబాద్): పేదంటి ఆడబిడ్డ పెళ్లికి గౌతంనగర్‌కు చెందిన ‘మానవసేవే–మాధవసేవ’ వాట్సాప్ గ్రూప్ సభ్యులు తమ వంతు చేయూతనిచ్చారు. చర్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గౌస్ కూతురి పెళ్లి ఈ నెల 25వ తేదీ నిశ్చయమైంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా కూతురు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నా విషయాన్ని గ్రూప్ సభ్యులు రాగం రాజు యాదవ్, ప్రసాద్యాదవ్ల ద్వారా విషయాన్ని మానవసేవే–మాధవసేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులు అడ్మిన్ కుమ్మరి రాజుకి తెలుపడంతో ఈ విషయాన్ని గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దీంతో గ్రూప్‌లో ఉన్న 21 మంది స్పందించి తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మొత్తం రూ.19 వేలు జమా కావడంతో గురువారం పెళ్లి కూతురి తండ్రి గౌస్‌కు నగదుతో పాటు, క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. తమ కూతురి పెళ్లికి ఆర్థిక సాయం చేసిన వాట్సాప్ గ్రూప్ సభ్యులకు గౌస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు కుమ్మరిరాజు, మహ్మద్ రషీద్, గణేష్ముదిరాజ్, కిట్టు, మోహన్‌రాజు, శంకర్, కొమురయ్య ఉన్నారు. (చదవండి: గంజాయి మత్తులో యువకుల వీరంగం.. అడ్డుకోబోయిన మహిళపై.. ) -
యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి (హైదరాబాద్): నిరుపేద యువతులకు డబ్బును ఎరగా చూపుతూ.. గత కొంత కాలంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ మహిళను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నర్సింహ్మ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెపల్లి మహ్మదీయ కాలనీకి చెందిన షాబానాబేగం(37)ను గత కొంత కాలంగా పేదరికంలో ఉన్న అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దింపుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మనసున్నోడు!
-
అధికారుల తప్పిదం.. బాలిక విద్యకు శాపం
* ఇంటిపేరు ముద్రణలో పొరపాటు * టెన్త్ మార్కుల జాబితాలో సరిచేయని అధికారులు అడ్డతీగల : అధికారులు చేసిన చిన్న తప్పిదం ఓ పేద బాలిక విద్యకు పెను శాపంగా మారింది. ఇంటి పేరును ఎస్ఎస్సీ బోర్డు అధికారులు తప్పుగా నమోదు చేయడంతో బాలిక చదువుకు దూరమైంది. అడ్డతీగల మండలం కోనలోవకు చెందిన కొమ్ముకూరి అబ్బులు కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడి కుమార్తె అనూష ఐదు నుంచి 7వ తరగతి వరకు అడ్డతీగలలో చదువుకుంది. 8 నుంచి 10 వరకూ ఏలేశ్వరంలోని సాంఘిక సంక్షే మ గురుకుల పాఠశాలలో చదివింది. 2015 మార్చిలో పబ్లిక్ పరీక్షలు రాయడానికి సిద్ధం కాగా, ఎస్ఎస్సీ బోర్డు నుంచి విడుదలైన హాల్ టికెట్లో ఆ బాలిక ఇంటిపేరు కొమ్ముకూరికి బదులుగా కొమ్మూరి అని ముద్రించారు. దీనిపై గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించి వినతిపత్రం రాసిస్తే పరీక్షలకు అనుమతించిన ఉపాధ్యాయులు ఒరిజనల్ మార్కుల జాబితాలో ఇంటిపేరు సరిచేసి వస్తుందని చెప్పారు. ఎస్ఎస్సీ బోర్డు నుంచి విడుదలైన మార్కుల జాబితాలో కొమ్మూరి అనే ముద్రించి వచ్చింది. అదే పాఠశాల ఉపాధ్యాయులు విడుదల చేసిన టీసీలో కొమ్ముకూరి అనూష అని రాసి ఇచ్చారు. 2015 జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభంలోపు పలుమార్లు తిరిగినా గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ లోగా జూన్‌లో కాకినాడలోని ఎంఎస్ఎన్ చార్టీస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు. అక్కడ గత ఏడాది డిసెంబర్ లోగా పదో తరగతి ఒరిజనల్ మార్కుల లిస్టు తీసుకురావాలని ప్రిన్సిపాల్ చెప్పడంతో జిల్లా విద్యాశాఖాధికారి బాలిక కలిసి విన్నవించింది. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో 2016 జనవరి 25 న కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన లే కపోయింది. మార్కుల జాబితా ఇవ్వకపోవడంతో ఇంటర్మీడియెట్ పరీక్షలకు అర్షత లేకుండా పోయింది. తమ కుమార్తె ఒరిజినల్ మార్కుల జాబితాలో ఇంటిపేరు మార్పు చేసి, పరీక్ష ఫీజు సమయానికి చెల్లించి కళాశాలలో ఇవ్వకపోవడంతో చదువు మధ్యలోనే మానివేయాల్సి వచ్చిందని అబ్బులు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తన కుమార్తెకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. -
నిద్రలోనే తుది శ్వాస విడిచిన బాలిక
మిరుదొడ్డి: అప్పటి వరకు బాగానే ఉన్న ఓ నిరుపేద బాలిక నిద్రలోనే అకస్మాత్తుగా తుది శ్వాస విడిచిన సంఘటన మండల పరిధిలోని అందె గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తులు తలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మాదర బోయిన కవిత (16), శ్రీనివాస్ అన్నా చెల్లెలు. వీరి తల్లిదండ్రులు గౌరవ్వ, సత్తయ్యలు మూడేళ్ల కాలంలోనే ఒకరి తర్వాత మరొకరు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అన్నా చెల్లెలు అనాథలుగా మారారు. రెక్కాడితే గానీ డొక్కలు నిండని పరిస్థితుల్లో కవిత పదవ తరగతి చదువును మధ్యలోనే ఆపేసింది. దీంతో అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ కూలీ నాలీ చేస్తూ జీవనం గడుపుతోంది. ఈ క్రమంలో ఆదివారం రోజున వ్యవసాయ కూలీ పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి వంటా వార్పు చేసింది. తన అన్న శ్రీనివాస్‌తో కలిసి రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రపోయారు. సోమవారం ఉదయం తన చెల్లి నిద్ర నుంచి లే పడానికి ప్రయత్నించడంతో కవిత ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. కంగారు పడ్డ శ్రీనివాస్ చుట్టు పక్కల వారికి తెలియజేశాడు. నిద్రలోనే కవిత చనిపోయినట్లు నిర్ధారించారు. మూడేళ్ళ కాలంలో తల్లిదండ్రులను, ఉన్న ఒక్క చెల్లెల్ని పోగొట్టుకున్న శ్రీనివాస్ కన్నీరు మున్నీరయ్యాడు. అందరితో కలుపుగోలుగా ఉండే కవిత మృతి చెందిందన్న విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు కన్నీళ్ళ పర్యంతమయ్యారు. గ్రామస్తులు చందాలు పోగు చేసుకుని కవిత అంత్యక్రియలు చేశారు. కుటుంబంలో అందరినీ పోగొట్టుకుని ఉండడానికి పెంకుటిల్లు తప్ప మరే ఇతర ఆస్తిపాస్తులు లేని అనాథగా మిగిలిన శ్రీనివాస్‌ను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సహృదయులు ఆదుకోవాలని ఎంపీటీసీ జక్కిరెడ్డి సోమేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు కోరారు. -
పోలీసుల వైఖరి మారాలి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఒక పేద బాలికపై జరిగిన అత్యాచారం కేసు పరిశోధనలో తమిళనాడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ దుయ్యబట్టారు. నిందితులను శిక్షించడంలో, బాధితురాలికి న్యాయం చేయడంలోనూ పోలీసులు కనీస విద్యార్హత లేని వ్యక్తుల్లా వహిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. కృష్ణగిరి జిల్లా తేన్‌కనికోట్టైకి చెందిన 16 ఏళ్ల బాలికపై గత డిసెంబర్ 25వ తేదీన కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసుల వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబడుతూ డీజీపీ ఆశోక్‌కుమార్‌ను శుక్రవారం చెన్నైలోని ఆయన కార్యాలయంలో బృందాకరత్ కలుసుకున్నారు. బాలికపై ఆఘాయిత్యం కేసును సంబంధిత ఎస్పీ తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని, పైగా కేసును దారిమళ్లించే విధంగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె డీజీపీని నిలదీశారు. సంఘటన జరిగి నెలరోజు లు దాటినా బాధిత బాలికకు న్యాయం జరిగేలా ఏదశలోనూ పోలీసులు వ్యవహరించలేదని ఆమె విమర్శించారు. మూగ, చెవుడు రుగ్మతలు ఉన్న బాలిక తనపై జరిగిన ఆఘాయిత్యాన్ని నోరి విప్పి చెప్పుకోలేదని ఆమె అన్నారు. అత్యాచారం జరిగినట్లుగా గుర్తించగల ఆధారాల సేకరణలో పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేశారని ఆమె ఆరోపించారు. ఆలస్యంగా వైద్య పరీక్ష లు నిర్వహించి అసలు అత్యాచారమే జరగలేదన్నట్లుగా తేల్చేసేందుకు సన్నద్ధమయ్యారని ఆమె విమర్శించారు. దీనికి బాధ్యులైన వ్యక్తులను సస్పెండ్ చేశామని మధ్యలో కలగజేసుకున్న డీజీపీ సమాధానం ఇచ్చారు. సస్పెండ్ చేస్తే సరిపోదు, బాధిత బాలికకు పూర్తి న్యాయం జరగాలి, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని డీజీపీని ఆమె కోరారు. ఇదిలా ఉండగా, కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరుతూ బాధిక బాలిక తండ్రి మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేశాడు. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో బాలికకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఖర్చుల నిమిత్తం బాలిక తండ్రికి రూ.20 వేలు చెల్లించాలని కృష్ణగిరి జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.