![Hyderabad: Whatsapp Group Person Helps Poor Girl Marriage - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/25/kl.jpg.webp?itok=sGIJjzxa)
మహ్మద్ గౌస్‌కు ఆర్థిక సాయం, బియ్యం అందజేస్తున్న సభ్యులు
సాక్షి,గౌతంనగర్(హైదరాబాద్): పేదంటి ఆడబిడ్డ పెళ్లికి గౌతంనగర్‌కు చెందిన ‘మానవసేవే–మాధవసేవ’ వాట్సాప్ గ్రూప్ సభ్యులు తమ వంతు చేయూతనిచ్చారు. చర్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గౌస్ కూతురి పెళ్లి ఈ నెల 25వ తేదీ నిశ్చయమైంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా కూతురు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నా విషయాన్ని గ్రూప్ సభ్యులు రాగం రాజు యాదవ్, ప్రసాద్‌యాదవ్‌ల ద్వారా విషయాన్ని మానవసేవే–మాధవసేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులు అడ్మిన్ కుమ్మరి రాజుకి తెలుపడంతో ఈ విషయాన్ని గ్రూప్‌లో పోస్ట్ చేశాడు.
దీంతో గ్రూప్‌లో ఉన్న 21 మంది స్పందించి తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మొత్తం రూ.19 వేలు జమా కావడంతో గురువారం పెళ్లి కూతురి తండ్రి గౌస్‌కు నగదుతో పాటు, క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. తమ కూతురి పెళ్లికి ఆర్థిక సాయం చేసిన వాట్సాప్ గ్రూప్ సభ్యులకు గౌస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు కుమ్మరిరాజు, మహ్మద్ రషీద్, గణేష్‌ముదిరాజ్, కిట్టు, మోహన్‌రాజు, శంకర్, కొమురయ్య ఉన్నారు.
(చదవండి: గంజాయి మత్తులో యువకుల వీరంగం.. అడ్డుకోబోయిన మహిళపై.. )
Comments
Please login to add a commentAdd a comment