అధికారుల తప్పిదం.. బాలిక విద్యకు శాపం | Surname printing mistake in school | Sakshi

అధికారుల తప్పిదం.. బాలిక విద్యకు శాపం

Published Tue, Apr 19 2016 4:38 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

అధికారుల తప్పిదం.. బాలిక విద్యకు శాపం - Sakshi

అధికారుల తప్పిదం.. బాలిక విద్యకు శాపం

* ఇంటిపేరు ముద్రణలో పొరపాటు
* టెన్త్ మార్కుల జాబితాలో సరిచేయని అధికారులు

అడ్డతీగల : అధికారులు చేసిన చిన్న తప్పిదం ఓ పేద బాలిక విద్యకు పెను శాపంగా మారింది. ఇంటి పేరును ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు తప్పుగా నమోదు చేయడంతో బాలిక చదువుకు దూరమైంది. అడ్డతీగల మండలం కోనలోవకు చెందిన కొమ్ముకూరి అబ్బులు కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడి కుమార్తె అనూష ఐదు నుంచి 7వ తరగతి వరకు అడ్డతీగలలో చదువుకుంది. 8 నుంచి 10 వరకూ ఏలేశ్వరంలోని సాంఘిక సంక్షే మ గురుకుల పాఠశాలలో చదివింది.

2015 మార్చిలో పబ్లిక్ పరీక్షలు రాయడానికి సిద్ధం కాగా, ఎస్‌ఎస్‌సీ బోర్డు నుంచి విడుదలైన హాల్ టికెట్‌లో ఆ బాలిక ఇంటిపేరు కొమ్ముకూరికి బదులుగా కొమ్మూరి అని ముద్రించారు. దీనిపై గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించి వినతిపత్రం రాసిస్తే పరీక్షలకు అనుమతించిన ఉపాధ్యాయులు ఒరిజనల్ మార్కుల జాబితాలో ఇంటిపేరు సరిచేసి వస్తుందని చెప్పారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు నుంచి విడుదలైన మార్కుల జాబితాలో కొమ్మూరి అనే ముద్రించి వచ్చింది. అదే పాఠశాల ఉపాధ్యాయులు విడుదల చేసిన టీసీలో కొమ్ముకూరి అనూష అని రాసి ఇచ్చారు. 2015 జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభంలోపు పలుమార్లు తిరిగినా గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఈ లోగా జూన్‌లో కాకినాడలోని ఎంఎస్‌ఎన్ చార్టీస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు. అక్కడ గత ఏడాది డిసెంబర్ లోగా పదో తరగతి ఒరిజనల్ మార్కుల లిస్టు తీసుకురావాలని ప్రిన్సిపాల్ చెప్పడంతో జిల్లా విద్యాశాఖాధికారి బాలిక కలిసి విన్నవించింది. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో 2016 జనవరి 25 న కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన లే కపోయింది. మార్కుల జాబితా ఇవ్వకపోవడంతో ఇంటర్మీడియెట్ పరీక్షలకు అర్షత లేకుండా పోయింది.

తమ కుమార్తె ఒరిజినల్ మార్కుల జాబితాలో ఇంటిపేరు మార్పు చేసి, పరీక్ష ఫీజు సమయానికి చెల్లించి కళాశాలలో ఇవ్వకపోవడంతో చదువు మధ్యలోనే మానివేయాల్సి వచ్చిందని అబ్బులు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తన కుమార్తెకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
 చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement