కొత్త ఇంట్లోకి... | Ramcharan Boyapati Movie Title Confirmed | Sakshi
Sakshi News home page

కొత్త ఇంట్లోకి...

Published Tue, Apr 17 2018 12:17 AM | Last Updated on Tue, Apr 17 2018 12:17 AM

Ramcharan Boyapati Movie Title Confirmed  - Sakshi

రామ్‌చరణ్‌

మరో మూడు రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నారు రామ్‌చరణ్‌. గృహప్రవేశం తేదీ కూడా ఫిక్స్‌ అయిపోయింది. ఈ నెల 21న కుటుంబ సభ్యులు, బంధువులందరితో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్‌ అయిపోతారట. ‘రంగస్థలం’ సినిమా సూపర్‌ సక్సెస్‌తో రామ్‌చరణ్‌ కొత్త ఇంటికి మారిపోయారని అనుకుంటే పొరబాటే. ఈ గృహప్రవేశం రియల్‌గా కాదు... రీల్‌గా. విషయం ఏంటంటే.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చరణ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో చరణ్‌ ఈ నెల 21 నుంచి పాల్గొంటారట. ఇప్పటివరకు ఇతర చిత్రబృందంతో సీన్స్‌ తెరకెక్కించారు.

ఈ సినిమా సెట్‌లోకి  చరణ్‌ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఓ భారీ ఇంటి సెట్‌ రూపొందించారట. ఆ ఇంటి సెట్‌లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర కీలక తారాగణంతో ముఖ్య సన్నివేశాలు తీయడానికి ప్లాన్‌ చేశారట. ‘రంగస్థలం’ సినిమాలో పల్లెటూరి కుర్రాడిలా కనిపించిన చరణ్‌ ఈ సినిమాలో ఫుల్‌ స్టైలిష్‌ మేకోవర్‌లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్, స్నేహా, ఆర్యన్‌ రాజేశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బోయపాటి మార్క్‌ యాక్షన్‌తో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement