'కపిల్ మంచోడు.. క్రిమినల్ కాదు' | Kapil Sharma is good human being, not a criminal, says Vivek Oberoi | Sakshi
Sakshi News home page

'కపిల్ మంచోడు.. క్రిమినల్ కాదు'

Published Thu, Sep 15 2016 7:13 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM

'కపిల్ మంచోడు.. క్రిమినల్ కాదు' - Sakshi

'కపిల్ మంచోడు.. క్రిమినల్ కాదు'

కమెడియన్ కపిల్ శర్మకు నటుడు వివేక్ ఒబెరాయ్ మద్దతు పలికాడు. బీఎంసీలో అవినీతి జరుగుతోందంటూ ప్రధానమంత్రిని ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేసినప్పటినుంచి కపిల్‌ను కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అయితే.. కపిల్ క్రిమినల్ కాదని, అతడు మంచి మనిషని వివేక్ ఒబెరాయ్ చెబుతున్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసేందుకు సాయం చేయాల్సిందిగా వివేక్ ఒబెరాయ్‌ని కపిల్ శర్మ కోరినట్లు తెలుస్తోంది.

తాను గత ఐదేళ్లుగా ఏడాదికి రూ. 15 కోట్ల ఆదాయపన్ను కడుతున్నానని, అయినా తనను 5 లక్షల లంచం అడిగారని కపిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకుడు జీవరాజ్ ఆల్వా కుమార్తెను పెళ్లి చేసుకున్న కపిల్.. ఇప్పుడు సమస్య నుంచి బయటపడేందుకు అవసరమైతే మామగారి వైపు నుంచి రాజకీయ పరిచయాలను కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. ఎవరికైనా సమస్యలు తీర్చగలిగే పరిస్థితిలో మనం ఉంటే ఆమాత్రం సాయం చేయాలని ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ తెలిపాడు. కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లల కోసం తాను నిధులు సేకరిస్తుంటానని, ఇందులో భాగం పంచుకుంటానని కపిల్ శర్మ స్వయంగా తనకు చెప్పాడని కూడా వివేక్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement