
అమరులకు నివాళులు
26/11 ఘటన అమరులకు సినీనటులు, విద్యార్థులు ఆదివారం నివాళులర్పించారు. అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక సమాఖ్య (ఏఐఏటీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం పార్శీ జింఖానా గ్రౌండ్‌లో ‘జరా యాద్ కరో ఖుర్బానీ’ అనే కార్యక్రమాన్ని సమాఖ్య అధ్యక్షుడు ఎం.ఎస్.బిట్టా ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ ఘటన జరిగి ఆరేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, వివేక్ ఒబేరాయ్‌తో పాటు వేలాది మంది విద్యార్థులు పోలీస్ జింఖానా సమీపంలో ఉన్న 26/11 స్మారక స్థలం వద్దకు చేరుకుని అప్పటి ఘటనలో ముష్కరుల దాడిని తిప్పికొట్టే క్రమంలో అశువులు బాసిన అమరజవానులకు నివాళులర్పించారు. అలాగే ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ప్రతిన బూనారు.