స్టెప్ అవుట్ అయితే స్టెప్ ఇన్ అవ్వాలి. అవును... ‘రంగస్థలం’ నుంచి స్టెప్ అవుట్ అయ్యి కొత్త సినిమాలోకి స్టెప్ ఇన్ అవ్వబోతున్నారు రామ్‌చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా అంగీకరించిన విషయం తెలిసిందే. త్వరలో ‘రంగస్థలం’ పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం స్టెప్పులేస్తున్నారు చరణ్. ఓ పాట చిత్రీకరణ జరగుతోంది. ఆ తర్వాత బోయపాటి సినిమాతో బిజీ అయిపోతారు. మరి.. బోయపాటి సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది కదా అంటే... ఫస్ట్ షెడ్యూల్‌లో నటి స్నేహ మరియు ఇతర తారాగణం పై కొన్ని సీన్లను చిత్రీకరించారు.
ఇవి ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్. పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. ఫిబ్రవరి మూడో వారంలో తర్వాతి షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట. ఆ షెడ్యూల్‌తో షూటింగ్‌లోకి స్టెప్ ఇన్ అవుతారు రామ్‌చరణ్. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఆ షెడ్యూల్‌లో పాల్గొంటారు. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా కొత్తగా ఉండబోతోందని, ఎక్కువ శాతం షూటింగ్ రాజస్థాన్‌లో జరగనుందని సమాచారం. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment