రామ్ అన్నా.. సూపర్ ఇంప్రెసివ్! | Super impressive Ram Anna, tweets vivek oberoi | Sakshi
Sakshi News home page

రామ్ అన్నా.. సూపర్ ఇంప్రెసివ్!

Nov 10 2015 11:17 AM | Updated on Aug 30 2019 8:24 PM

రామ్ అన్నా.. సూపర్ ఇంప్రెసివ్! - Sakshi

రామ్ అన్నా.. సూపర్ ఇంప్రెసివ్!

హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల తయారీ గురించి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్వీట్ చేయడంతో.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ స్పందించారు. సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా అంటూ తన ట్వీట్ మొదలుపెట్టారు.

సిసలైన హైదరాబాదీలైన బాలీవుడ్ ఒబెరాయ్‌లు ఎప్పటికీ హైదరాబాద్‌ను మాత్రం మర్చిపోరు, మర్చిపోలేరు. ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటూనే ఉంటారు. అందుకోసం సోషల్ మీడియాను కూడా బాగానే ఫాలో అవుతారు. హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల తయారీ కోసం బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థలు జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్వీట్ చేయడంతో.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ స్పందించారు. సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా అంటూ తన ట్వీట్ మొదలుపెట్టారు. మీరు చేస్తున్న ప్రయత్నాల వల్ల 'హైదరాబాద్ హ్యాపెనింగ్' మాత్రమే కాదు,  'టెర్రిఫిక్ తెలంగాణ' సాధ్యమవుతోందని చెప్పారు.

దానికి మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. వివేక్ భాయ్‌కి ధన్యవాదాలు చెబుతూనే, తమ హైదరాబాదీ ఒబెరాయ్ సాబ్ ఏం చేస్తున్నారని అడిగారు. వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ కూడా ఒకప్పుడు బాలీవుడ్‌లో రాజ్యమేలినవారే. ఆయన సిసలైన హైదరాబాదీ. ఆయనకు తన వందనాలు అందజేయాలని కేటీఆర్ కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement