క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌ | Vivek Oberoi Deletes Salman Aishwarya Meme | Sakshi
Sakshi News home page

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

Published Tue, May 21 2019 10:12 AM | Last Updated on Tue, May 21 2019 10:27 AM

Vivek Oberoi Defends Salman Aishwarya Meme - Sakshi

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌.. ఐశ్యర్య రాయ్‌ను కించపరుస్తూ రూపొందించిన మీమ్‌ను షేర్‌ చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వివేక్‌ చర్యల పట్ల బాలీవుడ్‌ జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తక్షణమే వివేక్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వివేక్‌ క్షమాపణలు చెప్పడమే కాక ఆ ట్వీట్‌ను కూడా డిలీట్‌ చేశారు. ఈ సందర్భంగా ‘కొందరికి సరదాగా తోచిన ఓ విషయం.. మరి కొం‍దరికి బాధ కల్గించవచ్చు. గత పదేళ్ల నుంచి నేను మహిళాసాధికారత కోసం పని చేస్తున్నాను. ఎప్పుడు ఏ మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు. నేను చేసిన పని వల్ల మహిళలు బాధపడుతున్నారు. అందుకే క్షమాపణలు చెప్తున్నాను. ఆ ట్వీట్‌ కూడా డిలీట్‌ చేశాను’ అంటూ ట్వీట్‌ చేశారు వివేక్‌.

ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్‌ అయిన ఐశ్వర్య రాయ్‌ వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ.. ఎగతాళిగా రూపొందించిన మీమ్‌ను వివేక్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజనులు ​ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్‌ నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఒబెరాయ్‌పై కేసు నమోదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement