
వివేక్.. హాయ్
బాలీవుడ్ హీరో వివేక్ ఓబరాయ్ సిటీకి హాయ్ చెప్పాడు. అఖిల భారతీయు తేరాపంత్ యుువక్ పరిషద్ వచ్చే నెల 6న గిన్నిస్ బుక్ రికార్డే ధ్యేయుంగా నిర్వహించనున్న ‘మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇక్కడికి వచ్చాడు.
బాలీవుడ్ హీరో వివేక్ ఓబరాయ్ సిటీకి హాయ్ చెప్పాడు. అఖిల భారతీయు తేరాపంత్ యుువక్ పరిషద్ వచ్చే నెల 6న గిన్నిస్ బుక్ రికార్డే ధ్యేయుంగా నిర్వహించనున్న ‘మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇక్కడికి వచ్చాడు. సోవూజిగూడ పార్క్ హోటల్‌లో గురువారం జరిగిన కార్యక్రవుంలో వివేక్‌తో కలిసి నిర్వాహకులు ఈ వివరాలు వెల్లడించారు.
ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 1.25 లక్షల యుూనిట్ల రక్తం సేకరించాలనేది ఈ మెగా క్యాంప్ ఉద్దేశం. రక్త దానం చేయూలనుకొనేవారి కోసం నగరంలో 15 సెంటర్లు ఏర్పాటు చేశారు. వివరాలకు 7799779910 నంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
మెగాస్టార్ ఒక్కడే...
‘గతంలో నగరానికి నేను రక్త చరిత్ర సినివూ కోసం వచ్చా. ఇప్పుడు రక్తదానం కోసం వచ్చా. పుట్టింది ఇక్కడే అరుునా నాలుగేళ్లప్పుడే సిటీ వదిలి వెళ్లిపోవడం వల్ల తెలుగు కొంచెం కొంచెమే వచ్చు. వూ నాన్న సురేష్ ఓబరాయ్ బాగా వూట్లాడతారు. ఇక్కడ నన్నొకరు మెగాస్టార్ అని సంబోధించారు. మెగాస్టార్ ఒక్కడే... అది చిరంజీవి వూత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు వివేక్ ఓబరాయ్.