![Raid Conducted at Aditya Alva's Residence, Marijuana Found - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/24/Aditya-Alva.jpg.webp?itok=xMNfQGZc)
బెంగళూరు: శాండల్ వుడ్ డ్రగ్ కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో కొంత మంది ప్రముఖులు వారి బంధువులు పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ లిస్ట్‌లో ఆదిత్య అల్వా కూడా నిందితులుగా ఉన్నారు. ఆదిత్య అల్వా మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సోదరుడు. శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య 6వ నిందితుడిగా ఉన్నారు. ఆదిత్య అల్వా నివాసంలో ఎన్‌సీబీ అధికారులు దాడులు చేయగా 55 గ్రాముల పొడి గంజాయి లభించింది.
లాక్‌డౌన్ సమయంలో ఆల్వా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య అల్వా ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్‌సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 4 నుంచి పరారీలో ఉన్నాడు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. క్రైమ్ బ్రాంచ్ అతనికి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆదిత్యను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment