సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. కానీ ఆదిత్య గ్రూప్ ఛైర్మన్ ఆదిత్యరామ్ పేదలతో పండుగ జరుపుకున్నారు. చెన్నై ECR వద్ద ఉన్న తన ఆదిత్యరామ్ ప్యాలెస్ వద్దకు పణైయూర్, అక్కరై, ఉతండి, ఇంజంబాకం, శోలింగనల్లూరు వంటి ప్రాంతాల్లోని సుమారు ఐదువేల మంది పేద ప్రజలు, అనాథ వృద్ధులు అక్కడికి చేరుకున్నారు. వారందరితో కలిసి ఆయన సంక్రాంతి జరుపుకున్నారు.
కులమత భేదాలు లేకుండా వారికి నాణ్యమైన బియ్యంతో పాటు పండుగ సందర్భంగా చేసుకునే వంటలకు అవసరమైన వస్తువులను వారందరికీ పంపిణీ చేసి, వారు పండుగను ఆనందంగా జరుపుకునేలా శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్యరామ్ అందించిన పండుగ కానుకలను స్వీకరించిన ప్రజలు, 'ప్రతి పండుగలో మాకు ఆదిత్యరామ్ అందించే ఈ సహాయం మా జీవితాలకు ఎంతో ముఖ్యమైనది. ఇది మాకు ఆర్థికంగా చాలా తోడ్పాటుగా ఉంది' అని సంతోషంతో తెలియజేశారు. వారు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.
ఆదిత్యరామ్ కూడా తన జీవన ప్రయాణం గురించి ఇలా పంచుకున్నారు. 'నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, పలు కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ అనుభవం కారణంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని గాఢమైన సంకల్పం కలిగింది. నా శక్తి మేరకు చివరి వరకు సహాయం చేయడం కొనసాగిస్తాను.' అని తెలిపారు. ఆదిత్యరామ్ కోలీవుడ్‌లో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఆయన రాణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment