ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తరువాత మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాల తరువాత చరణ్ ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.
బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ రాజస్థాన్‌లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని కోటల్లో షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 70 శాతం షూటింగ్ అక్కడే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment