
అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా బయోపిక్‌లకు అన్ని చోట్లా క్రేజ్‌నెలకొంది. సౌత్‌లో మహానటి సినిమాతో బయోపిక్‌లకు మంచి గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఝాన్సీ లక్ష్మీభాయి జీవితచరిత్రపై మణికర్ణిక రిలీజ్‌కు రెడీ అవ్వగా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ జీవితాన్ని తెరపైకి తెచ్చేందుకు బాలీవుడ్ సిద్దమైంది.
అయితే ఈ చిత్రానికి పీఎం:నరేంద్ర మోదీ అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. మోదీ పాత్రలో విలక్షణ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించనున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించాడు. సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. జనవరి 7న ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు.. జనవరిలోనే చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.
IT’S OFFICIAL... Vivekanand Oberoi [Vivek Oberoi] to star in Narendra Modi biopic, titled #PMNarendraModi... Directed by Omung Kumar... Produced by Sandip Ssingh... First look poster will be launched on 7 Jan 2019... Filming starts mid-Jan 2019.
— taran adarsh (@taran_adarsh) 4 January 2019
Comments
Please login to add a commentAdd a comment