వివేక్ కోసం జేమ్స్బాండ్ టైనర్ | James Bond trainer to help Vivek Oberoi for his next | Sakshi
Sakshi News home page

వివేక్ కోసం జేమ్స్బాండ్ టైనర్

Published Mon, Aug 22 2016 2:52 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

వివేక్ కోసం జేమ్స్బాండ్ టైనర్

వివేక్ కోసం జేమ్స్బాండ్ టైనర్

బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ త్వరలో రెండు విభిన్న చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాలో ఫ్యాక్షన్ లీడర్గా నటించిన వివేక్, మరోసారి అదే దర్శకుడితో కలిసి ఓ అండర్ వరల్డ్ డాన్ జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ముత్తప్ప రాయ్ అనే మాఫీయా డాన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న రాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఖేల్ అనే మరో సినిమాలోనూ ఒకేసారి నటించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించేందుకు వివేక్ కష్టపడుతున్నాడు. కాసినో రాయల్, స్కైఫాల్ లాంటి సినిమాల కోసం డానియల్ క్రెగ్ను ట్రయిన్ చేసిన ఆంతోని పెకోరా పర్యవేక్షణలో బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. రాయ్ సినిమాలో భారీ దేహంతో డాన్లా కనిపించనున్నాడు, అదే సమయంలో ఖేల్ సినిమా కోసం సన్నగా కనిపించాల్సి ఉంది. అంత త్వరగా బాడీ బిల్డ్ చేయటం వెంటనే సన్నబడటం లాంటివి చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అంతర్జాతీయ స్థాయి ట్రైనర్ను ఎంపిక చేసుకున్నాడు వివేక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement