మంచిగైంది | Vivek Oberoi apologises for sharing meme on Aishwarya | Sakshi
Sakshi News home page

మంచిగైంది

Published Wed, May 22 2019 12:08 AM | Last Updated on Wed, May 22 2019 12:08 AM

Vivek Oberoi apologises for sharing meme on Aishwarya  - Sakshi

ఐశ్వర్యకు పెళ్లయిపోయాక కూడా వివేక్‌ ఒబేరాయ్‌కి ఆమెపై ప్రేమ ఇంకా పోనట్లుంది. పోకపోతే పోయింది.. ఆమె పరువు తీసి, తన పరువూ తీసేసుకున్నాడు! దేశమంతా ఎగ్జిట్‌ పోల్స్‌ మూడ్‌లో ఉన్నప్పుడు ఈయన ఒక్కడు ఐశ్వర్య మూడ్‌లోకి వెళ్లిపోయాడు. ఐశ్వర్య, సల్మాన్‌ ఉన్న పాత ఫొటో ఒకటి సంపాదించి, దానికి ‘ఒపీనియన్‌ పోల్‌’ అని కాప్షన్‌ పెట్టాడు. ఐశ్వర్యతో తను ఉన్న ఫొటోను ఆల్బమ్‌లోంచి బయటికి లాగి, దానికి ‘ఎగ్జిట్‌ పోల్‌’ అని కాప్షన్‌ పెట్టాడు. ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్, వారి పాప ఆరాధ్య కలిసి ఉన్న ఫొటో వెదికి తీసి, దాని కింద ‘రిజల్ట్‌’ అని కాప్షన్‌ పెట్టాడు.

ఈ మూడు ఫొటోలను జాయింట్‌ చేసి ట్విట్టర్‌లో పెట్టాడు! వెంటనే నెటిజన్‌లు ‘ఇదేం తలతిక్క పని ఒబెరాయ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. సోనమ్‌ కపూర్‌ ‘క్లాస్‌లెస్‌’ అన్నారు.నేలబారు పని అని! ఢిల్లీ ఉమెన్‌ కమిషన్‌ చైర్మన్‌ స్వాతీ మలీవాల్‌ ‘డిస్‌టేస్ట్‌ఫుల్‌’ అన్నారు. చవకబారు పని! నేషనల్‌ ఉమెన్‌ కమిషన్‌ చైర్మన్‌ ‘డిస్‌గస్టింగ్‌’ అన్నారు. చీదర పని అని! మహారాష్ట్ర ఉమెన్‌ కమిషన్‌ కూడా ఒబెరాయ్‌ ట్వీట్‌పై తీవ్రంగా స్పందించబోతోంది. ఇప్పటికే నేషనల్‌ కమిషన్‌ ఆయన్ని వివరణ అడిగింది. ఢిల్లీ కమిషన్‌ ఆపాలజీ అడిగింది. ఆ ట్వీట్‌ ఫొటోలో మైనర్‌ బాలికను (ఆరాధ్య) ను చూపించడం కూడా ఇప్పుడు పెద్ద అఫెన్స్‌ కాబోతోంది. ఏం పని ఇది వివేక్‌! ఐశ్వర్యకే కాదు. నీకూ పెళ్లయింది కదా. ఇప్పుడు భార్యకు ముఖమెలా చూపిస్తావ్‌?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement