aradhya bacchan
-
మంచిగైంది
ఐశ్వర్యకు పెళ్లయిపోయాక కూడా వివేక్ ఒబేరాయ్‌కి ఆమెపై ప్రేమ ఇంకా పోనట్లుంది. పోకపోతే పోయింది.. ఆమె పరువు తీసి, తన పరువూ తీసేసుకున్నాడు! దేశమంతా ఎగ్జిట్ పోల్స్ మూడ్‌లో ఉన్నప్పుడు ఈయన ఒక్కడు ఐశ్వర్య మూడ్‌లోకి వెళ్లిపోయాడు. ఐశ్వర్య, సల్మాన్ ఉన్న పాత ఫొటో ఒకటి సంపాదించి, దానికి ‘ఒపీనియన్ పోల్’ అని కాప్షన్ పెట్టాడు. ఐశ్వర్యతో తను ఉన్న ఫొటోను ఆల్బమ్‌లోంచి బయటికి లాగి, దానికి ‘ఎగ్జిట్ పోల్’ అని కాప్షన్ పెట్టాడు. ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్, వారి పాప ఆరాధ్య కలిసి ఉన్న ఫొటో వెదికి తీసి, దాని కింద ‘రిజల్ట్’ అని కాప్షన్ పెట్టాడు. ఈ మూడు ఫొటోలను జాయింట్ చేసి ట్విట్టర్లో పెట్టాడు! వెంటనే నెటిజన్లు ‘ఇదేం తలతిక్క పని ఒబెరాయ్’ అంటూ ట్వీట్ చేశారు. సోనమ్ కపూర్ ‘క్లాస్లెస్’ అన్నారు.నేలబారు పని అని! ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్మన్ స్వాతీ మలీవాల్ ‘డిస్టేస్ట్ఫుల్’ అన్నారు. చవకబారు పని! నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ ‘డిస్గస్టింగ్’ అన్నారు. చీదర పని అని! మహారాష్ట్ర ఉమెన్ కమిషన్ కూడా ఒబెరాయ్ ట్వీట్‌పై తీవ్రంగా స్పందించబోతోంది. ఇప్పటికే నేషనల్ కమిషన్ ఆయన్ని వివరణ అడిగింది. ఢిల్లీ కమిషన్ ఆపాలజీ అడిగింది. ఆ ట్వీట్ ఫొటోలో మైనర్ బాలికను (ఆరాధ్య) ను చూపించడం కూడా ఇప్పుడు పెద్ద అఫెన్స్ కాబోతోంది. ఏం పని ఇది వివేక్! ఐశ్వర్యకే కాదు. నీకూ పెళ్లయింది కదా. ఇప్పుడు భార్యకు ముఖమెలా చూపిస్తావ్?! -
కూతురు కూచి
ఎక్కడైనా ‘అమ్మకూచి’ ఉంటుంది. కూతురు కూచి ఉంటుందా? ఉంటుంది! చూస్తూనే ఉన్నారుగా. ఐశ్వర్యారాయ్! ఎప్పుడూ కూతురు చెయ్యి పట్టుకుని తిరగాల్సిందే. కాన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై నడిచేటప్పుడు.. పక్కన కూతురు. ఆస్ట్రేలియాలో ఇండియా జెండాని ఆవిష్కరిస్తున్నప్పుడు.. పక్కన కూతురు. ఎవరి పెళ్లికైనా వెళితే.. పక్కన కూతురు. దుర్గా పూజ చేస్తుంటే.. పక్కన కూతురు. ఇప్పుడు చెప్పండి.. ఐశ్వర్యారాయ్ కూతురు కూచీనే కదా. నవంబర్ 16న ఆరాధ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చూడాల్సింది. కూతురెవరో, తల్లెవరో తెలియలేదు. ఇద్దరూ ఒకటే డ్రెస్ వేసుకున్నారు. టూల్ గౌన్లు! ఆ లైట్ పింక్ కలర్ టూల్ గౌన్లలో ఐశ్వర్య చిన్నపిల్ల అయిపోయిందా, ఆరాధ్య.. అమ్మలా కనిపించిందా.. ఏమో కన్ఫ్యూజన్. నిన్న మళ్లీ ముంబై పోర్ట్‌లో ఇద్దరూ ట్విన్స్‌లా ప్రత్యక్షం అయ్యారు. బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్. మీరు చూస్తున్న ఫొటో అదే. ఆరాధ్యకు ఆరేళ్లు. తెలిసినవాళ్లంతా.. ‘స్కూల్‌కి పోదా మీ అమ్మాయి’ అని ఐశ్వర్యను, అభిషేక్‌ను పీక్కుతింటున్నారు. మమ్మీ డాడీలు నవ్వి ఊరుకుంటున్నారు. ‘సరోగేట్ మదర్’గా ఐశ్వర్య ఓ సినిమాలో నటించబోతున్నారు. అందులో బిజీ అయిపోయాక, ఈ కూతురుకూచి ఆరాధ్యపై బెంగపెట్టుకుంటారో ఏమో! -
మా అమ్మాయి రణ్‌బీర్‌ని తన తండ్రి అనుకుంది!
‘ఏ దిల్ హై ముష్కిల్’... అంటే ఈ మనసు చాలా క్లిష్టమైనది అని అర్థం. ఇప్పుడీ చిత్ర దర్శక-నిర్మాత కరణ్ జోహార్ పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. భారత్-పాక్ మధ్య ఏర్పడిన తాజా సమస్యల కారణంగా పాకిస్తాన్ నటీనటులు నటించిన చిత్రాలను విడుదల చేయకూడదనీ, అసలు వాళ్లను ఎంకరేజ్ చేయకూడదనీ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ‘ఏ దిల్ హై ముష్కిల్’లో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ప్రత్యేక పాత్ర చేయడం ఈ చిత్రానికి తలనొప్పిగా మారింది. సినిమా విడుదలైతే థియేటర్లు బద్దలు కొడతామని ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన’ పేర్కొంది. దాంతో 28న ఈ చిత్రం విడులవుతుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు చూసి, కోడలుపిల్ల అలా నటించినందుకు అమితాబ్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్త ప్రచారమైంది. ‘టూ మచ్’గా ఉన్న సీన్స్‌ని తీసేయాలని కరణ్ జోహార్‌ని అమితాబ్ కోరారని మరో వార్త వచ్చింది. ఆ వార్తల సంగతెలా ఉన్నా.. ఈ సీన్స్ గురించి ఐశ్వర్యా రాయ్ ఏమంటున్నారో చూద్దాం. ‘‘ఇందులో నా పాత్ర పేరు సబా తలియర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ పాత్ర పేరు అయాన్. సబాయే అయాన్ జీవితం. ఆమె కవితలను అతను పాడతాడు. సబా ప్రభావం అతని మీద ఎంత ఉంటుందంటే.. అతని జీవితంలో ఓ భాగమైపోతుంది. విడిపోవడంలో కూడా ఓ కొనసాగింపు ఉంటుంది. అంత గాఢమైన బంధం వాళ్లది. ఆ బంధం తాలూకు ప్రేమ చాలా గాఢంగా ఉంటుంది. అందుకే సబా, అయాన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌లో ఆ గాఢత కనిపించాలని కరణ్ జోహార్ అన్నారు. రొమాన్స్ డోస్ ఇంకా ఉండాలన్నారు. కానీ, నా కంఫర్ట్ స్పేస్ దాటి నేనేదీ చేయలేదు’’ అని ఐష్ స్పష్టం చేశారు. ఇంకా ‘ఏ దిల్ హై ముష్కిల్’ గురించి ఆమె మాట్లాడుతూ - ‘‘సినిమా చూసి, బయటికొచ్చేవాళ్లు ‘ఎంత అందమైన కెమిస్ట్రీ’ అనుకోకుండా ఉండలేరు. సినిమాలో ఉన్న ప్రేమ గురించి, పాటల గురించి, విజువల్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. నేను సబాలాంటి పాత్రను ఇంతవరకూ చేయలేదు. ఆ మాటకొస్తే... రీల్‌పై సబా ఎదుర్కొన్న అనుభవాలు రియల్ లైఫ్‌లో నేను ఎదుర్కోలేదు. ఒప్పుకున్న పాత్రకు న్యాయం చేయడం నటిగా నా ధర్మం. ‘జజ్బా’లో దల్బీర్ కౌర్‌గా సాదాసీదా లుక్‌లో కనిపించాను. ఈ సినిమాలో అందంగా కనిపించాలి, కనిపించాను. క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా కనిపిస్తాను. ఆ విషయంలో నాకెలాంటి అభద్రతాభావం లేదు’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఐష్-అభిషేక్ బచ్చన్ల ముద్దుల కూతురు ఆరాధ్యా బచ్చన్ ఓసారి రణ్‌బీర్ కపూర్‌ని చూసి, తన తండ్రి అనుకుందట. ఈ విషయం గురించి ఐష్ మాట్లాడుతూ - ‘‘ఒక రోజు అభిషేక్ లాంటి టోపీ, జాకెట్ వేసుకున్నాడు రణ్‌బీర్. అతన్ని వెనక నుంచి చూసిన ఆరాధ్య తన డాడీ అనుకుంది. వెనకాల నుంచి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంది. ఆ తర్వాత కంగారు పడింది’’ అన్నారు.