కూతురు కూచి | ardya birthday celebrations on November 16 | Sakshi
Sakshi News home page

కూతురు కూచి

Published Mon, Jan 8 2018 11:59 PM | Last Updated on Mon, Jan 8 2018 11:59 PM

ardya  birthday celebrations on November 16 - Sakshi

ఎక్కడైనా ‘అమ్మకూచి’ ఉంటుంది. కూతురు కూచి ఉంటుందా? ఉంటుంది! చూస్తూనే ఉన్నారుగా. ఐశ్వర్యారాయ్‌! ఎప్పుడూ కూతురు చెయ్యి పట్టుకుని తిరగాల్సిందే. కాన్స్‌ ఫెస్టివల్‌లో రెడ్‌ కార్పెట్‌పై నడిచేటప్పుడు.. పక్కన కూతురు. ఆస్ట్రేలియాలో ఇండియా జెండాని ఆవిష్కరిస్తున్నప్పుడు.. పక్కన కూతురు. ఎవరి పెళ్లికైనా వెళితే.. పక్కన కూతురు. దుర్గా పూజ చేస్తుంటే.. పక్కన కూతురు. ఇప్పుడు చెప్పండి.. ఐశ్వర్యారాయ్‌ కూతురు కూచీనే కదా. నవంబర్‌ 16న ఆరాధ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చూడాల్సింది. కూతురెవరో, తల్లెవరో తెలియలేదు.

ఇద్దరూ ఒకటే డ్రెస్‌ వేసుకున్నారు. టూల్‌ గౌన్లు! ఆ లైట్‌ పింక్‌  కలర్‌ టూల్‌ గౌన్‌లలో ఐశ్వర్య చిన్నపిల్ల అయిపోయిందా, ఆరాధ్య.. అమ్మలా కనిపించిందా.. ఏమో కన్‌ఫ్యూజన్‌. నిన్న మళ్లీ ముంబై పోర్ట్‌లో ఇద్దరూ ట్విన్స్‌లా ప్రత్యక్షం అయ్యారు. బ్లూ షర్ట్, బ్లాక్‌ ప్యాంట్‌. మీరు చూస్తున్న ఫొటో అదే. ఆరాధ్యకు ఆరేళ్లు. తెలిసినవాళ్లంతా.. ‘స్కూల్‌కి పోదా మీ అమ్మాయి’ అని  ఐశ్వర్యను, అభిషేక్‌ను పీక్కుతింటున్నారు. మమ్మీ డాడీలు నవ్వి ఊరుకుంటున్నారు. ‘సరోగేట్‌ మదర్‌’గా ఐశ్వర్య ఓ సినిమాలో నటించబోతున్నారు. అందులో బిజీ అయిపోయాక, ఈ కూతురుకూచి ఆరాధ్యపై బెంగపెట్టుకుంటారో ఏమో!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement