‘‘మలయాళ చిత్రాలు వాస్తవానికి దగ్గరగా, ఆలోచన రేకెత్తించేలా ఉంటాయని ప్రేక్షకులు భావించడం సంతోషం. అయితే కొన్నాళ్లుగా థియేటర్‌లో హాయిగా కూర్చుని పాప్ కార్న్ తింటూ విజల్స్ వేస్తూ ఎంజాయ్ చేసే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలు రాలేదు. మా ‘కడువా’ ఆ లోటుని తీరుస్తుంది. ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని
పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు.
షాజీ కైలాస్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్తా మీనన్ జంటగా వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కడువా’. మ్యాజిక్ ఫ్రేమ్స్– పృథ్వీరాజ్ ప్రొడక్ష¯Œ ్సపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించిన ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు...
► ‘సింహాసనం’ (2012) తర్వాత మళ్లీ షాజీ కైలాస్ దర్శకత్వంలో సినిమా చేయడం ఎలా అనిపించింది?
పృథ్వీరాజ్: మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్లకు షాజీ కైలాస్‌గారు పెట్టింది పేరు. ఆయన సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. నేను దర్శకత్వం
వహించిన ‘లూసిఫర్’లో కొన్ని చోట్ల ఆయన మార్క్ కనిపిస్తుంది. ‘కడువా’ కథ వినగానే ‘మీరు డైరెక్ట్ చేస్తే ఈ సినిమాను నేనే నిర్మిస్తాను’ అన్నాను. ‘కడువా’ ఆయన మార్క్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది.
► కడువా అంటే ఏంటి?
కడువా అంటే పులి. ఇందులో హీరో పేరు కడువకున్నేల్ కురువచన్. షార్ట్ కట్‌లో కడువా. అందుకే ప్రతి భాషలో అదే టైటిల్ పెట్టాం. కడువ కున్నేల్ ధనికుడు. ఒక వ్యక్తితో చిన్న అహం సమస్య మొదలై పెద్ద హింసకు దారితీస్తుంది. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ ఈ చిత్రకథపై రచయితకి మరో వ్యక్తికి మధ్య వివాదం వచ్చింది. కోర్టు రచయితకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
మీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ లోనూ అహం పాయింట్ ఉంది కదా..
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (తెలుగులో ‘భీమ్లా నాయక్)లో అహం అనే పాయింట్ ఉన్నా, సినిమాటిక్‌గా రియల్ స్టోరీ. కానీ ‘కడువా’ మాత్రం కమర్షియల్, లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తో పోలికలుండవు.
► మీకు ఎలాంటి జోనర్ సినిమాలంటే ఇష్టం?
నా దృష్టిలో గుడ్ మూవీ, బ్యాడ్ మూవీ.. అంతే. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా, వైవిధ్యమైన సినిమా అయినా.. ఏదైనా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తే అదే గుడ్ మూవీ. సినిమా చూస్తూ ఫోన్‌లో మెసేజ్‌లు చెక్ చేసుకుంటూ దిక్కులు చూస్తుంటే అది బ్యాడ్ మూవీ. నేనెప్పుడూ మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడుతుంటాను.
► నటన, దర్శకత్వం, నిర్మాణం, పాటలు పాడటం... ఇన్ని పనులు కష్టం అనిపించవా?
అవన్నీ సినిమాలో భాగమే. అయితే నిర్మాణానికి ఎంతో ప్రతిభ కావాలి. ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఈ విషయంలో నా భార్య (సుప్రియా మీనన్) సపోర్ట్‌గా ఉంటారు. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే వంటివి నేను చూసుకుంటాను. జీఎస్టీ, ఫైల్స్ వంటి బోరింగ్ పనుల్ని నా భార్య చూస్తుంది(నవ్వుతూ).
► మీ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ‘కడువా’ని థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి కారణం?
పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా విడుదల అవ్వాలనుకున్నాను. ‘కడువా’తో అది మొదలు పెట్టాను. భవిష్యత్‌లో రీమేక్ సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి పరిశ్రమ నుండి మల్టీ లాంగ్వేజ్ సినిమాలని రూపొందించడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. రాజమౌళిగారి ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మెయిన్ స్ట్రీమ్‌గా రిలీజ్ అయ్యాయి. ఆయన చూపించిన ఆ మోడల్‌ని మనం ఫాలో అవ్వాలి. ‘కేజీఎఫ్ 2’ కూడా ఇదే మోడల్‌లో రిలీజ్ అయింది. పెద్ద బడ్జెట్ సిని మాలు భవిష్యత్‌లో అన్ని భాషల్లో థియేటర్ రిలీజ్ కావాలి. థియేటర్‌లో సినిమాని ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి. ఈ అనుభూతి ఓటీటీ ఇవ్వలేదు.
మీ సినిమాలు తెలుగులో రీమేక్ కావడం గురించి...
హ్యాపీ. ‘లూసిఫర్’ రీమేక్ చిరంజీవిగారు చేస్తున్నారు. ఆ చిత్రాన్ని నేను తెలుగులో దర్శకత్వం చేసి ఉన్నా ఆయనే నా ఫస్ట్ ఆప్షన్. తెలుగు రీమేక్ కథలో మార్పులు గురించి నాకు తెలీదు. నేనూ ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
► ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి దర్శకత్వం వహించే అవకాశం ఎందుకు వదులుకున్నారు?
చిరంజీవిగారికి నేను అభిమానిని. ‘లూసిఫర్’ రీమేక్ చేయమని అడిగారు. కానీ, వేరే సినిమాతో నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అంతకు ముందు ‘సైరా నరసింహా రెడ్డి’లో కూడా ఒక పాత్ర చేయమని కోరారు.. అప్పుడూ వీలుపడలేదు. చిరంజీవిగారితో పని చేయాలని ఉంది. నేను ‘లూసిఫర్ 2’ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు రీమేక్ అవకాశం వస్తే చిరంజీవి గారితో చేస్తాను.
Prithviraj Sukumaran: ఇక రీమేక్ సినిమాలు ఉండవు..ఆ మోడల్‌ని ఫాలో అవ్వాల్సిందే
Published Sun, Jun 26 2022 1:26 AM | Last Updated on Sun, Jun 26 2022 10:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment