కొబ్బరికాయ కొట్టి ఒకే ఒక్క నెల అయింది. ఈలోపే ‘ఇన్‌కమ్’ స్టార్ట్ అయితే ఆనందమే ఆనందం. రామ్‌చరణ్–బోయపాటి శ్రీను–డీవీవీ దానయ్య అలాంటి ఆనందంలోనే ఉన్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ‘రైట్స్’ రూపంలో ఫ్యాన్సీ ఆఫర్ వస్తే అది ఆ హీరో, డైరెక్టర్ స్టామినాని తెలియజేస్తుంది. చరణ్–బోయపాటి కాంబినేషన్‌లో దానయ్య నిర్మిస్తోన్న సినిమా ఇప్పటికి దాదాపు 47 కోట్లు రాబట్టిందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
రిలీజ్‌కి ముందే ఇన్ని కోట్లంటే నిర్మాతకు పండగే. ఇంతకీ 47 కోట్లు ఎలా రాబట్టిగలిగిందంటే... హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్, తెలుగు శాటిలైట్ రైట్స్ ద్వారా ఇంత మొత్తం వచ్చిందని భోగట్టా. చిత్రీకరణ ప్రారంభించిన కొన్ని రోజులకే ఇంత పెద్ద బిజినెస్ జరగటంతో చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
శుక్రవారంతో రెండో షెడ్యూల్ ముగిసింది. హైదరాబాద్ పరిసరాల్లో ఈ భారీ షెడ్యూల్ జరిగింది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. సినిమాలో ఎంతో Mీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్‌లు హీరో రామ్‌చరణ్‌కు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సన్నివేశాల్లో హీరో పాల్గొనలేదు. నెక్ట్స్ మంత్ 8న ప్రార ంభమయ్యే మూడో షెడ్యూల్‌లో రామ్‌చరణ్ పాల్గొంటారని చిత్రబృందం తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment