మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కడువా. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అదే సమయంలో దీనిపై వివాదాలు సైతం రాజుకున్నాయి. మూవీలో కొన్ని సన్నివేశాలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవడంతో చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి ఆ సన్నివేశాలను తొలగించింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 4 నుంచి ప్రసారం కానుంది. అయితే ఓటీటీ రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ జోస్ కురువినక్కునీల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. కడువాలోని ప్రధాన పాత్ర పేరు సహా తన జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారని మండిపడ్డాడు. ఇక గతంలోనూ అతడు కడువా విడుదల ఆపేయాలంటూ ఫిర్యాదు చేశాడు.
తన జీవితకథ ఆధారంగా సినిమా తీశారని, కానీ కొన్ని సన్నివేశాలు తనను, తన కుటుంబ గౌరవాన్ని మంట గలిపేలా ఉన్నాయని మండిపడ్డాడు. దీంతో సెన్సార్ బోర్డ్ సినిమాలోని లీడ్ క్యారెక్టర్ పేరును కురువచన్ అని కాకుండా కురియచన్ అని మార్చాలని సూచించింది. ఇన్ని వివాదాల నడుమ విడుదలైన ఈ మూవీ మరికొద్ది రోజుల్లో ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, సంయుక్త మీనన్, కలాభవన్ షాజన్ ముఖ్య పాత్రలు పోషించారు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాజిక్ ఫ్రేమ్స్– పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు.
చదవండి: విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే
రవితేజకు ఊహించని షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్!
Comments
Please login to add a commentAdd a comment