25 ఫ్లాట్లు దానం చేయనున్న హీరో | Vivek Oberoi's company donates 25 flats to families of CRPF bravehearts | Sakshi
Sakshi News home page

25 ఫ్లాట్లు దానం చేయనున్న హీరో

Published Sat, May 13 2017 8:44 AM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

25 ఫ్లాట్లు దానం చేయనున్న హీరో - Sakshi

25 ఫ్లాట్లు దానం చేయనున్న హీరో

థానె: అమరవీరుల కుటుంబాలకు తన వంతు సాయం చేసేందుకు బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్ ముందుకు వచ్చాడు. మహారాష్ట్రలోని థానెలో సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌(సీఆర్ఫీఎఫ్‌) అమర సైనికుల కుటుంబాలకు 25 ఫ్లాట్లు దానం చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు సీఆర్ఫీఎఫ్‌కు లేఖ రాశాడు.

వివిధ ఘటనల్లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సీఆర్ఫీఎఫ్‌ అమరవీరుల కుటుంబాలకు తన కంపెనీ కరమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తరపున 25 ఫ్లాట్లు నిర్మించి ఇవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇప్పటికే నాలుగు ఫ్లాట్లు ఇచ్చినట్టు సమాచారం. ఎంపిక చేసిన కుటుంబాల పేర్లతో జాబితాను కరమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విడుదల చేసింది.

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో మావోయిస్టు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన 12 మంది సీఆర్ఫీఎఫ్‌ సైనికుల కుటుంబాలకు హీరో అక్షయ్‌కుమార్‌ ఇంతకుముందు రూ. 1.08 కోట్ల విరాళం ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement