25 ఫ్లాట్లు దానం చేయనున్న హీరో
థానె: అమరవీరుల కుటుంబాలకు తన వంతు సాయం చేసేందుకు బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ముందుకు వచ్చాడు. మహారాష్ట్రలోని థానెలో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్ఫీఎఫ్) అమర సైనికుల కుటుంబాలకు 25 ఫ్లాట్లు దానం చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు సీఆర్ఫీఎఫ్కు లేఖ రాశాడు.
వివిధ ఘటనల్లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సీఆర్ఫీఎఫ్ అమరవీరుల కుటుంబాలకు తన కంపెనీ కరమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ తరపున 25 ఫ్లాట్లు నిర్మించి ఇవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇప్పటికే నాలుగు ఫ్లాట్లు ఇచ్చినట్టు సమాచారం. ఎంపిక చేసిన కుటుంబాల పేర్లతో జాబితాను కరమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విడుదల చేసింది.
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన 12 మంది సీఆర్ఫీఎఫ్ సైనికుల కుటుంబాలకు హీరో అక్షయ్‌కుమార్ ఇంతకుముందు రూ. 1.08 కోట్ల విరాళం ప్రకటించాడు.