ఇస్మార్ట్‌ కుక్క: హీరో ఫిదా! | Dog Gets Own Sledge Rides Down Vivek Oberoi Loves The Dog Video | Sakshi
Sakshi News home page

ఈ కుక్క చాలా తెలివైంది!

Published Tue, Feb 4 2020 11:24 AM | Last Updated on Tue, Feb 4 2020 3:32 PM

Dog Gets Own Sledge Rides Down Vivek Oberoi Loves The Dog Video - Sakshi

స్లిఘ్ రైడ్‌(ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు జారడం) అంటే ఇష్టం ఉండని వారుండరు. మంచు ప్రాంతం కనిపిస్తే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు స్లీఘ్‌ రైడ్‌కు ఆసక్తి చూపుతారు. అలాగే ఈ కుక్కకు కూడా అలా జారుతూ ఆడుకోవడం ఇష్టం అనుకంటా. మంచు ప్రాంతం కనిపించగానే స్లిఘ్‌తో జారుతూ ఆడుకుంటున్న వీడియోను ఓ ట్విటర్‌ యూజర్‌ ఆదివారం షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కీ అనే వ్యక్తి ‘ఈ రోజు మీరు చూసిన గొప్ప విషయం ఇదే అనుకుంటా’ అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్‌ చేశాడు.  ఈ వీడియోకు ఇప్పటి వరకు  5 మిలియన్ల వ్యూస్‌ రాగా వందల్లో కామెంటు వస్తున్నాయి.  ‘ఇది చాలా తెలివైన కుక్క’, ‘ఈ రోజు నేను చూసిన అత్యంత గొప్ప సంఘటన ఇదే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

ఈ కుక్క స్వయంగా దాని నోటితో ప్లాస్టిక్‌ స్లిఘ్ను తీసుకుని మంచుతో కప్పి ఉన్న ఎత్తైన ప్రదేశం పైకి ఎక్కి దాన్ని కాళ్లకింద వేసుకుని కిందికి జారుతూ ఆస్వాదిస్తున్న ఈ వీడియోకు సినిమా హీరోలు సైతం ఫిదా అవుతున్నారు. దీని తెలివికి బాలీవుడ్‌ నటుడు వివెక్‌ ఒబెరాయ్‌ ఆశ్యర్యపోతూ.. ‘నిజంగా ఇది చాలా ముద్దుగా ఉంది!!’ ‘ఈ కుక్క స్మార్ట్‌ ఫోన్‌ కంటే స్మార్ట్‌’ అని కామెంటు చేశాడు. అంతేగాక హాలీవుడ్‌ నటుడు క్రిస్‌ ఎవాన్స్‌ కూడా ‘హే.. ఏంటీ ఈ కుక్క స్లిఘ్ చేస్తుంది.. అంతా ఓకే కదా!’ అంటూ వీడియోను రీ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement