
విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద రంగస్థలం కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూ వస్తోంది. ఈ చిత్ర సక్సెస్ మీట్ నేడు హైద్రాబాద్‌లో జరగనుండగా.. పవన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఇక ఈ చిత్రంలో చిట్టిబాబుగా చెర్రీ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కెరీర్‌లోనే బెస్ట్ ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడంటూ పలువురు ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు. తాజాగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్‌కు చెర్రీ నటనకు ఫిదా అయ్యాడు.
వివేక్ తన ట్విటర్‌లో స్పందిస్తూ...‘ చిట్టిబాబు సౌండ్ ఇంజనీర్!!! రంగస్థలం చాలా పెద్ద సక్సెస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. వాటే బ్రిలియంట్ ట్రాన్స్‌ఫర్మేషన్! నువ్వు సూపర్‌స్టార్, సూపర్ ఫెర్ఫార్మర్‌ల మెగా కాంబోవి! నిన్ను చూస్తే గర్వంగా ఉంది. గాడ్ బ్లెస్ యు. సూపర్ టాలెంటెడ్ టీమ్‌కు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే బోయపాటి, రామ్‌చరణ్ సినిమాలో ప్రతినాయకుడిగా వివేక్ ఒబేరాయ్ నటిస్తోన్న విషయం తెలిసిందే.
Chitti Babu sound engineer!!! So happy for my bro #RamCharan & the Massive Blockbuster success of #Rangasthalam!What a brilliant transformation! You are a ‘Mega’ combo of superstar & superperformer! God bless, proud of u man! Big congrats to the super talented team! Take a bow! pic.twitter.com/pVB5W4w05B
— Vivek Anand Oberoi (@vivekoberoi) April 13, 2018
Comments
Please login to add a commentAdd a comment