చరణ్‌ సినిమాకు భారీ డీల్‌ | Ram Charan and Boyapati Srinu movie Hindi Satellite Deal | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 21 2018 10:31 AM | Last Updated on Wed, Feb 21 2018 10:31 AM

Ram Charan and Boyapati Srinu movie Hindi Satellite Deal - Sakshi

రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు చెర్రీ. తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఇంతవరకు రామ్ చరణ్ షూటింగ్ కూడా హాజరు కాకముందే ఈ సినిమా బిజినెస్‌ మొదలైపోయిందట.

డీవీవీ దానయ్య నిర‍్మిస్తున్న ఈ సినిమా హిందీ శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ను ఓ ప్రముఖ సంస్థ 22 కోట్ల మొత్తానికి సొంతం చేసుకుంది. జంజీర్ సినిమాతో చరణ్ బాలీవుడ్‌కు సుపరిచితుడు కావటంతో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తుండటంతో ఇంత ధర పలికిందని భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం చెర్రీ సరికొత్త లుక్‌ ట్రై చేస్తున్నాడట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement