బాలీవుడ్ చిత్రంలో నరేంద్రమోడీగా వివేక్ ఒబెరాయ్
బీజేపీ ప్రధాని అభ్యర్థి పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించే అవకాశం కనిపిస్తోంది. నరేంద్ర మోడి జీవిత కథ నేపథ్యంతో అమెరికాకు చెందిన ఓ దర్శకుడు రూపొందించే చిత్రంలో నటించమని అడిగినట్టు వివేక్ తెలిపారు. అన్ని కుదిరితే ఈ చిత్రంలో యువ మోడీగా వివేక్ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
గుజరాత్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ లోని స్టాఫ్ క్యాంటిన్ లో పనిచేసే ఉద్యోగిగా, టీ స్టాల్ నడిపించే చిరు యజమాని పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించే అవకాశం ఉంది. డిసెంబర్ 23 తేదిన యువజన సమావేశంలో పాల్గొన్న వివేక్ ఈ వార్తపై సానుకూలంగా స్పందించారు.
నరేంద్రమోడీగా నటించమని దర్శక, నిర్మాతలు తనను అడిగారని ఓ ప్రశ్నకు వివేక్ సమాధానమిచ్చారు. నరేంద్రమోడీపై నిర్మించే చిత్రానికి మితేష్ పటేల్ దర్శకత్వం వహిస్తారని వివేక్ తెలిపారు.