tusshar kapoor
-
ఆరేళ్లకు మళ్లీ!
2014లో వచ్చిన ‘జిద్’ అనే హిందీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు సీరత్ కపూర్. ఆ తర్వాత వరుసగా తెలుగులో ‘రన్ రాజా రన్, రాజుగారి గది 2, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి సినిమాలతో బిజీ అయ్యారు. ఆమె నటించిన ‘మా వింత గాధ వినుమా’ లాక్డౌన్లో విడుదలైంది. తొలి హిందీ సినిమా తర్వాత వరుసగా తెలుగు సినిమాలే చేసుకుంటూ వచ్చిన సీరత్ ఆరేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్లో ఓ సినిమా కమిటయ్యారు. ‘మారిచ్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఓ మర్డర్ మిస్టరీలో హీరోయిన్గా నటిస్తున్నారు సీరత్. నసీరుద్దిన్ షా, అనితా, తుషార్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది థియేటర్స్‌లోకి తీసుకొస్తారట. -
పెళ్లికాకుండానే తల్లైన ఏక్తాకపూర్..
క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్‌గా పేరుపొందిన ఏక్తా కపూర్(43) పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యారు. ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఎమోషనల్ స్టోరీస్ ఇలా వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ జనవరి 27న సరోగసి (అద్దె గర్భం) ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రముఖ నటుడు జితేంద్రకు ఏక్తా కపూర్ కుమార్తె అనే విషయం తెలిసిందే. సరోగసి ద్వారా జితేంద్ర కుటుంబం ఓ బిడ్డకు జన్మను ప్రసాదించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఏక్తా కపూర్ సోదరుడు, నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసి ద్వారా ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. బడే అచ్చే లగ్తీ హై, కుమ్ కుమ్ భాగ్య, కుండలి భాగ్య, యే మోహబ్బతేన్, కసమ్,తెరే ప్యార్ కి, క్యూంకీ సాస్ బీ కబీ బహు థి సీరియల్స్‌తో ఏక్తా కపూర్ బడా నిర్మాతగా పేరొందారు. ఇక పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి ప్రొడ్యుసర్‌గా నిలదొక్కుకున్నారు. ఆమె నిర్మించిన విద్యాబాలన్ ‘ది డర్టీ పిక్చర్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం వంద కోట్లను వసూలు చేసింది. అనంతరం రాగిణి ఎమ్మెమ్మెస్, వీర్ దే వెడ్డిండ్,హాఫ్ గర్ల్ ఫ్రెండ్ తదితర చిత్రాలను సైతం నిర్మించారు ఏక్తాకపూర్. -
150 దేశాల్లో 600 థియేటర్లలో 'జన గణ మన'!
కోల్ కతా: పాప్ సాంగ్స్, హిప్పీ, వెస్ట్రన్ సంగీతం మోజులో పడిన పిల్లలకు, యువతకు జాతీయ గీతంపై అవగాహన కల్పించేందుకు సుమారు 70 మంది ప్రముఖ వ్యక్తులతో జాతీయ గీతం 'జన గణ మన'ను కొత్త వీడియోగా చిత్రీకరించారు. రాజీవ్ వాలియా దర్శకత్వం వహించిన కొత్త వీడియోను 150 దేశాలల్లో 600 థియేటర్లలో ప్రదర్శించారు. జాతీయ గీతాన్ని రూపొందించడానికి ఎనిమిది నెలలు పట్టిందని రాజీవ్ వాలియా తెలిపారు. ఈ వీడియోకు స్వరూప్ భల్వంకర్ సంగీతాన్ని సమకూర్చగా, బాల గాయని సంచితి సాకత్ పాడారని వాలియా మీడియాకు వివరాలందించారు. ఈ వీడియోలో బాలీవుడ్ తారలు శిల్పాశెట్టి, వివేక్ ఓబెరాయ్, తుషార్ కపూర్, అనుపమ్ ఖేర్, ఇషా కొప్పికర్, మల్లికా షరావత్, జానీ లీవర్ లు, మెజీషియన్ పీసీ సర్కార్, నృత్యాకారిణీలు సుజాతా మహాపాత్ర, క్రికెటర్లు ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్, కుస్తీ ఆటగాడు సంగ్రామ్ సింగ్, బాలీవుడ్ గాయకులు అల్కా యాగ్నినిక్, అను మాలిక్, జావెద్ ఆలీ, మోహిత్ చౌహాన్, ఉదిత్ నారాయణ్ లు, ఇంకా పూనమ్ థిల్లాన్, పద్మిని కొల్హాపూరి లు కూడా ఉన్నారు. తాజ్ మహల్, కోణార్క్ టెంపుల్, బాంద్రా, ఇండియా గేట్, ఎర్రకోట, తదితర ప్రాంతాల్లో 1500 మంది పిల్లలపై చిత్రీకరించారు. -
తుషార్‌కు జాక్‌పాట్!
బాలీవుడ్ మాజీ హీరో జితేంద్ర కొడుకు తుషార్ కపూర్‌కు జాక్‌పాట్ తగిలినట్టు హాలీవుడ్ భోగట్టా. బాలీవుడ్లో కొన్నేళ్లుగా తంటాలు పడుతున్నా, ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్లేవీ లేని తుషార్‌కు మాజీ జేమ్స్‌బాండ్ స్టార్ పీర్స్ బ్రోస్నన్, కేట్ హడ్సన్లతో నటించే అవకాశం దొరికిందట. ఆటవిడుపుగా అమెరికా వెళ్లిన తుషార్‌కు అనుకోకుండా ఈ అవకాశం దక్కినట్టు అతడి సన్నిహితుడొకరు చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం.. పీర్స్ బ్రోస్నన్ కొడుకు సీన్ బోస్నన్.