బుడ్డోడి జనగణమన.. వైరల్‌ వీడియో | Arunachal child singing Jana Gana Mana Viral Video | Sakshi
Sakshi News home page

బుడ్డోడి జనగణమన.. వైరల్‌ వీడియో

Published Sat, May 11 2019 12:17 PM | Last Updated on Sat, May 11 2019 12:39 PM

Arunachal child singing Jana Gana Mana Viral Video - Sakshi

‘జనగణమన అధినాయక జయహే..’  ఈ పాట ఎవరూ పాడినా..ఎప్పుడు పాడినా భారతీయులు గుండెలు ఉప్పొంగుతాయి. దేశభక్తి పెల్లుబుక్కుతుంది. మరి ముద్దొచ్చే ఓ చిన్నారి పాడితే.. ఈ వీడియో వైరల్‌ కాకుండా ఎలా ఉంటుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

జాతీయ గీతాన్ని మనస్సుపెట్టి హృదయం ఉప్పొంగేలా చిన్నారి ఆలపిస్తున్న ఈ వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. నోరు సరిగ్గా తిరగకపోయినా.. జాతీయ గీతంలోని కొన్ని చరణాలను కలిపేస్తూ.. చివర్లో కొన్ని చరణాలను మరిచిపోయి.. బుడ్డుడో లీనమై దేశభక్తి చాటేలా పాడిన తీరు నెటిజన్లను ముగ్ధులను చేస్తోంది. చిరుప్రాయంలోనే జాతీయగీతాన్ని గుర్తుంచుకొని పాడిన బుజ్జాయిని అభినందిస్తూ.. ప్రశంసిస్తూ నెటిజన్లు ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement