గబ్బర్సింగ్కు అవార్డుల పంట | 6 SIIMA Awards to Gabber Singh | Sakshi
Sakshi News home page

గబ్బర్సింగ్కు అవార్డుల పంట

Published Sat, Sep 14 2013 5:05 PM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

గబ్బర్సింగ్కు అవార్డుల పంట

గబ్బర్సింగ్కు అవార్డుల పంట

చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా గబ్బర్సింగ్కు దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల (సీమా) పంటపండింది.  షార్జాలో గురు,శుక్రవారాలలో జరిగిన కార్యక్రమాలలో  దక్షిణ భారతదేశంలోని తెలుగు, తమిళ్, మలయాలం, కన్నడ భాషా చిత్రాలకు ఈ అవార్డులు అందజేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉత్తమ నటుడుగా, శృతిహాసన్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.

గబ్బర్సింగ్ చిత్రానికి మొత్తం ఆరు కేటగిరీల్లో అవార్డులు రావడం విశేషం. ఉత్తమ దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హాస్యనటుడు శ్రీను, ఫైట్మాస్టర్లు రామ్-లక్ష్మణ్లను అవార్డులు వరించాయి. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అల్లు అర్జున్ నటించిన జులాయ్, దగ్గుబాటి రాణా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలకు చెరో రెండు అవార్డులు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement