Gabbarsingh
-
43 ఏళ్ల తరువాత బయటపెట్టిన ‘షోలే’ దర్శకుడు
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు వరుసగా సెన్సార్ బోర్డ్ తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన సీనియర్ దర్శకుడు రమేష్ సిప్పి ఇది కొత్త వచ్చిన సమస్య కాదని.. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో సెన్సార్ సమస్యలు ఉన్నాయిని వెల్లడించారు. ఈసందర్భంగా షోలే సినిమా విడుదల సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు. పుణే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన 43 ఏళ్ల తరువాత షోలే సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. షోలే సినిమా క్లైమాక్స్ ను దర్శకుడు మరో రకంగా చిత్రీకరించాలని భావించాడట. అయితే సెన్సార్ సభ్యులు ఠాకూర్, గబ్బర్‌సింగ్‌ను కాళ్లతో తన్ని చంపటంపై, వయలెన్స్ ఎక్కువగా ఉండటంపై అభ్యంతరాలు తెలపటంతో తాను అనుకున్నది తెరకెక్కించకుండా కొద్ది పాటి మార్పులు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆ మార్పులు చేయటం తనకు ఇష్టం లేకపోయినా.. సెన్సార్ సభ్యుల సూచనల మేరకు చేయక తప్పలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో కంటెంట్ ఉండటం లేదన్న విమర్శలను సైతం రమేష్ సిప్పి ఖండించారు. రాజ్‌కుమార్ హిరానీ లాంటి దర్శకులు మంచి కథా కథనాలతో సినిమాలు రూపొందిస్తున్నారని, యువ దర్శకులు మంచి ఆలోచనలతో కొత్త సాంకేతికతతో సినిమాలు రూపొందిస్తున్నారని తెలిపారు. -
బన్నీ సినిమాకు గబ్బర్‌సింగ్ సెంటిమెంట్
సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ ద్విపాత్రభినయం చేస్తున్న ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను మహా శివరాత్రి రోజునే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ గబ్బర్‌సింగ్ టీజర్ కూడా మహా శివరాత్రి రోజునే రిలీజ్ అయ్యింది. ఆ సెంటిమెంట్‌ను డిజె విషయంలోనూ కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. -
గబ్బర్‌సింగ్ డైరెక్టర్‌కి మరో ఛాన్స్
దాదాపు పుష్కర కాలం పాటు ఒక్క హిట్ కూడా లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తిరిగి ఫాంలోకి తీసుకు వచ్చిన సినిమా గబ్బర్‌సింగ్. పవన్ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ఈ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ తరువాత చేసిన రామయ్య వస్తారవయ్య డిజాస్టర్ కావటంతో సీన్ రివర్స్ అయ్యింది. హరీష్‌కి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామయ్య వస్తావయ్య ఫ్లాప్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న హరీష్, సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో సక్సెస్ సాధించాడు. అదే జోరులో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎస్ జె సూర్య దర్శకత్వంలో హుషారు(వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్న పవన్, ఆ తరువాత దాసరి నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. ఈ సినిమాతో పాటు తనకు ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన ఏఎం రత్నం బ్యానర్లో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు రత్నం. ఇప్పటికే పవర్ స్టార్ కోసం ఓ లైన్ వినిపించిన హరీష్, ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
సర్థార్ గబ్బర్‌సింగ్‌లో సుబ్రమణ్యం
-
గబ్బర్‌సింగ్‌కు అవార్డుల పంట
చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా గబ్బర్‌సింగ్‌కు దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల (సీమా) పంటపండింది. షార్జాలో గురు,శుక్రవారాలలో జరిగిన కార్యక్రమాలలో దక్షిణ భారతదేశంలోని తెలుగు, తమిళ్, మలయాలం, కన్నడ భాషా చిత్రాలకు ఈ అవార్డులు అందజేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉత్తమ నటుడుగా, శృతిహాసన్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. గబ్బర్‌సింగ్ చిత్రానికి మొత్తం ఆరు కేటగిరీల్లో అవార్డులు రావడం విశేషం. ఉత్తమ దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హాస్యనటుడు శ్రీను, ఫైట్మాస్టర్లు రామ్-లక్ష్మణ్‌లను అవార్డులు వరించాయి. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అల్లు అర్జున్ నటించిన జులాయ్, దగ్గుబాటి రాణా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలకు చెరో రెండు అవార్డులు వచ్చాయి.