
Samantha Bags Best Actress Award For Oh Baby: హీరోయిన్ సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఒక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న సమంత ఏ పాత్రలో అయినా జీవించేస్తుంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2019-20 సంవరత్సరాలకు గాను విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందులో ఓ బేబీ చిత్రానికి గాను సమంత ఉత్తమ నటిగా ఎంపికైంది. అయితే ప్రస్తుతం చెన్నైలో ఉన్న సమంత అవార్డు వేడుకకు హాజరు కాలేజకపోయింది. దీంతో సామ్ స్ధానంలో హీరో నాని ఆ అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించి సమంత.. థ్యాంక్యూ నాని..నా బదులు అవార్డును తీసుకున్నందుకు. ఉత్తమ నటి అవార్డును తీసుకుంటావని అని ఎప్పుడైనా ఊహించావా అంటూ ఫన్నీగా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక జెర్సీ మూవీకి అవార్డు రావడంపై నానికి కంగ్రాట్స్ చెప్పింది.
చదవండి : ఆ ప్రశ్న అడగటంతో రిపోర్టర్‌పై సమంత సీరియస్
ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సామ్.. వైరల్