మళ్లీ ఎటో వెళ్లిపోయింది మనసు... | Nani Yeto vellipoyindi manasu Re release | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎటో వెళ్లిపోయింది మనసు...

Published Wed, Jul 24 2024 12:26 AM | Last Updated on Wed, Jul 24 2024 12:26 AM

Nani Yeto vellipoyindi manasu Re release

ప్రేమకథలను ఇష్టపడే వారి జాబితాలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ (2012) సినిమా కూడా ఉంటుంది. నాని, సమంత లీడ్‌ రోల్స్‌లో నటించగా, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రేష్మా, ఎస్‌. వెంకట్, సి. కల్యాణ్, సీవీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఇళయరాజా అందించిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కాగా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా రీ రిలీజ్‌ కానుంది. లక్ష్మీ నరసింహా మూవీస్‌ బ్యానర్‌ మీద సుప్రియ, శ్రీనివాస్‌  ఆగస్టు 2న ఈ సినిమాను మళ్లీ విడుదల చేయనున్నారు. ‘‘ప్రస్తుతం తెలుగులో రీ–రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ సినిమా మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాతలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement