SIIMA Awards 2022: Vijay Devarakonda Emotional Speech Video Viral - Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: హిట్‌ ఇద్దామనుకున్నా, కానీ.. రౌడీ హీరో

Published Mon, Oct 10 2022 8:53 PM | Last Updated on Tue, Oct 11 2022 9:12 AM

SIIMA Awards 2022: Vijay Devarakonda Speech Goes Viral - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ లైగర్‌ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ అవుదామనుకున్నాడు. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా! అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా లైగర్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా చతికిలపడింది. దీంతో అప్పటిదాకా గ్యాప్‌ లేకుండా ప్రమోషన్స్‌ చేసిన విజయ్‌ ఫ్లాప్‌ టాక్‌ రావడంతో మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు.

లైగర్‌ ఫ్లాప్‌ తర్వాత తొలిసారి సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుకల్లో పాల్గొన్నాడు రౌడీ హీరో. యూత్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది సౌత్‌ ఇండియన్‌ సినిమా అవార్డును గెలుచుకున్నాడు. అవార్డును అందుకునే క్రమంలో విజయ్‌ ఎమోషనలయ్యాడు. 'ఈ వేదికపై అవార్డులు అందుకున్న అందరికీ కృతజ్ఞతలు. గొప్ప సినిమాలు, అద్భుతమైన పర్ఫామెన్స్‌తో మీరు ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా ఇండస్ట్రీకి హిట్‌ ఇద్దామనుకున్నా, అందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. మనందరికీ మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి.

ఏ రోజుల్లోనైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులు కచ్చితంగా, ఎంతో జాగ్రత్తగా పూర్తి చేయాల్సిందే! ఈ ఫంక్షన్‌కు నేను రాకూడదనుకున్నా.. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్దామని వచ్చా! మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తానని మాటిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: సోషల్‌ మీడియాకు కరణ్‌ గుడ్‌బై
అమ్మా, నిన్ను ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం: నమ్రత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement