'సీతారామం' బ్యూటీ తెలుగింటి కోడలు కానుందా? | Allu Aravind Comments On Mrunal Thakur Marriage In SIIMA Awards | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ప్రముఖ నిర్మాత ఆశీర్వాదం.. మృణాల్ పెళ్లి అలా జరగడం గ్యారంటీ!

Published Sun, Oct 29 2023 7:19 PM | Last Updated on Mon, Oct 30 2023 8:50 AM

Allu Aravind Comments On Mrunal Thakur Marriage SIIMA Awards - Sakshi

తెలుగులో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ వాళ్లలో హిట్ కొట్టి, స్టార్స్ అయ్యేది మాత్రం ఒకరో ఇద్దరు మాత్రమే ఉంటారు. అలా గతేడాది రిలీజైన 'సీతారామం' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించిన బ్యూటీ మృణాల్ ఠాకుర్. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఈమె పెళ్లి చేసేసుకోవాలని టాలీవుడ్ బడా నిర్మాత ఆశీర్వాదించాడు. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.

తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తరఫున ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకుల్ని అలరించారు. గతంలో ఓ సందర్భంగా ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని.. హైదరాబాద్ వచ్చేయ్ అమ్మా అని ఆశీర్వదించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు లావణ్.. మెగాఫ్యామిలీకి చెందిన హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. నవంబరు 1న వరుణ్-లావణ్య పెళ్లి కూడా జరగనుంది.

(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్)

సరే లావణ్య పెళ్లి సెట్ అయినప్పుడు చాలామంది అల్లు అరవింద్ ఆశీర్వాదం గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆయనే.. 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్‌ని కూడా ఆశీర్వదించారు. సైమా అవార్డ్స్‌లో 'సీతారామం' సినిమాకుగానూ ఉత్తమ నటిగా మృణాల్ నిలిచింది. ఈ అవార్డుని అల్లు అరవింద్.. ఈమెకు ప్రెజెంట్ చేశారు. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

'గతంలో ఓ వేదికపై హీరోయిన్‌తో ఓ మాట అన్నాను. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని టాలీవుడ్‌కి కోడలిగా వచ్చేయమన్నాను. ఆ మాటని ఆమె నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా. టాలీవుడ్ కోడలిగా హైదరాబాద్ వచ్చేయ్' అని అల్లు అరవింద్, మృణాల్ ఠాకుర్ తో అన్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఆ సినిమా షూటింగ్‌లో దౌర్జన్యం.. కత్తులు తెచ్చి నటితో అలా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement