
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల వీళ్ల నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కొన్నేళ్లు ఈ జంట ప్రేమలో ఉన్నా.. ఎక్కడా బయటపడలేదు. మీడియాలో వార్తలు వచ్చినా స్పందించలేదు. దీంతో ఇది పుకారు మాత్రమేనని అంతా అనుకున్నారు. కానీ సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చారు.
వీరి ఎంగేజ్‌మెంట్ తర్వాత అల్లు అరవింద్ గతంలో ఓ మూవీ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ‘చావు కబురు చల్లగా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న అల్లు అరవింద్.. 'ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని అన్నారు. అది ఇప్పుడు నిజమైంది. అల్లు అర్జున్ కూడూ ఈ వీడియోని షేర్ చేసి మరీ ‘మా నాన్న విజనరీ, ఆయన చెప్పిందే జరిగింది’ అని ట్వీట్ చేశాడు. ఇదంతా అనుకోకుండా జరిగిందని, తాజాగా అల్లు అరవింద్ చెప్పుకొచ‍్చారు.
‘బేబీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అరవింద్ గెస్ట్ వచ్చారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి యాంకర్ ఆయనకు గుర్తు చేసింది. దీనిపై అరవింద్ స్పందిస్తూ.. ‘ఏదో సరదాగా చెప్తే.. లావణ్య సీరియస్‌గా తీసుకొని మా వాడినే పెళ్లి చేసుకోబోతుంది’ అని ఫన్నీగా అన్నారు. అంతేకాదు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యని ఇప్పుడే పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఇంకా మంచి భవిష్యత్ ఉందని, కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి ఆలోచన చేసుకోవాలని అన్నారు.
ఇక బేబి విషయానికొస్తే.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రమిది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 14న విడుదల కాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment